కారు మార్చినంత ఈజీ కాదు రాజధానులు మార్చడం

రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదంటూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. మూడు రాజధానుల ప్రస్తావన ఏంటో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. అభివ‌ద్ధి వికేంద్రీకరణ చేయొచ్చని.. కానీ ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని ఆయన అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే అభివృద్ధి జరగదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీపై విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ తలాతోక లేని నివేదిక […]

కారు మార్చినంత ఈజీ కాదు రాజధానులు మార్చడం
Follow us

| Edited By:

Updated on: Dec 29, 2019 | 10:39 AM

రాజధాని అంటే కారు మార్చినంత సులువు కాదంటూ జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి. మూడు రాజధానుల ప్రస్తావన ఏంటో తనకు అర్థం కాలేదని ఆయన అన్నారు. అభివ‌ద్ధి వికేంద్రీకరణ చేయొచ్చని.. కానీ ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని ఆయన అన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానిని మారిస్తే అభివృద్ధి జరగదని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జీఎన్‌రావు కమిటీపై విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ తలాతోక లేని నివేదిక ఇచ్చిందని సుజనా మండిపడ్డారు.

అమరావతి రాజధానికి గతంలో జగన్ అంగీకరించారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరోలా ఆయన మాట్లాడుతున్నారని సుజనా దుయ్యబట్టారు. ఏడాదిలో 30రోజులు జరిగే అసెంబ్లీ అమరావతిలో పెడితే రాజధాని అంటారా..? అంటూ ఈ సందర్భంగా ప్రశ్నించారు. అమరావతి పేరిట గత ప్రభుత్వం బాండ్స్ ఇష్యూ చేసిందని.. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటని సుజనా గుర్తుచేశారు. ఇక అమరావతిలో ఆస్తులు తీసుకున్న ప్రైవేట్ సంస్థలు కోర్టుకెళ్తే.. రూ.2లక్షల కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు.

ఇక ఇన్‌సైడ్ ట్రేడింగ్‌లో తన పేరు ఉందని మంత్రులు అంటున్నారని.. ఒకవేళ తన పేరుంటే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎందుకు చదవలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధానిని కదిలితే ఏపీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని.. లీగల్‌గా ఇబ్బందులు ఎదురై కోర్టులు చుట్టూ తిరిగితే.. ప్రభుత్వం పరిపాలన ఇంకేం చేస్తుందని ఆయన మండిపడ్డారు. రాజధాని మారిస్తే కేంద్రం కూడా చూస్తూ ఉరుకోదని.. కచ్చితంగా సమయానికి స్పందిస్తుందని సుజనా అన్నారు. రాజధాని అన్నది ఒక్క అమరావతి సమస్య మాత్రమే కాదని.. దీనిపై 13 జిల్లాల ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. రేపు వైజాగ్ ప్రజలు కూడా ఆనందంగా ఉండరని సుజనా జోస్యం చెప్పారు. కుక్కలు మొరుగుతూ ఉంటాయి.. కానీ నేను ఏనుగులా ముందుకు వెళ్తానని సుజనా కామెంట్లు చేశారు.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.