చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే..! సుజనా నోట.. షాకింగ్ మాట

Sujana Chowdary sensational comments on Chandrababu Naidu, చంద్రబాబు ఎమ్మెల్యే మాత్రమే..! సుజనా నోట.. షాకింగ్ మాట

జమిలి ఎన్నికలపై మాట్లాడే అర్హత ప్రతిపక్షనేత చంద్రబాబుకు లేదన్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఆయన కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమేనని పేర్కొన్న సుజనా.. జమిలి ఎన్నికలపై ఇంతవరకు తనకు సమాచారం లేదని పేర్కొన్నారు. రాజధాని ప్రాంత రైతులతో కలిసి సుజనా చౌదరి, కామినేని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై ఆయనకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై విమర్శలు గుప్పించారు.

జగన్‌ సర్కార్‌కు పరిపాలనపై దృష్టి లేదని, కేవలం ప్రతిపక్షాలపై దాడి చేయడంపైనే ఎక్కువ దృష్టి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. పాలనపై వైసీపీ నేతలు దృష్టి పెట్టాలని.. పోలవరం, అమరావతిపై గందరగోళం నెలకొందని ఆయన చెప్పుకొచ్చారు. రాజధానిపై మంత్రి బొత్స స్టేట్‌మెంట్ ఇచ్చి నెలరోజులు గడుస్తున్నా.. ముఖ్యమంత్రి మాత్రం దీనిపై ఇప్పటి వరకూ స్పందించలేదని విమర్శించారు.

ఇక పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర నిర్లక్ష్యం వహించారని.. ఆ తరువాత టీడీపీ హయాంలో కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని సుజనా పేర్కొన్నారు. ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా ఏకపక్ష ధోరణితో వెళ్తోందని.. కేంద్రం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలవరంపై ఆలస్యం చేయడం వల్ల ప్రతీ సీజన్‌లో 10వేల కోట్లు నష్టం వస్తుందని.. టెండర్లు మార్చడం వలన 5 రూపాయలు కూడా ఆదా చేయలేరని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే కేంద్రం కచ్చితంగా జోక్యం చేసుకుంటుందని ఈ సందర్భంగా సుజనా హెచ్చరించారు.

అయితే ఈ ఏడాదిలో ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల వరకు సుజనా టీడీపీలోనే ఉన్నారు. ఆ తరువాత చంద్రబాబుకు షాక్ ఇస్తూ బీజేపీ కండువాను కప్పుకున్నారు. ఇక ఇప్పుడు బాబును టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *