క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్.. 3 టీమ్‌‌ క్రికెట్‌ సక్సెస్‌‌‌‌

సౌతాఫ్రికా క్రికెట్‌‌ బోర్డు నమ్మశక్యం కాని ఫార్మాట్‌‌ను తెరపైకి తెచ్చింది. 3 టీమ్‌‌ క్రికెట్‌‌ (3TC) పేరిట.. ఎనిమిదేసి ప్లేయర్లు ఉన్న మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్‌‌కు ప్లాన్‌‌ చేసింది. ప్రయోగాత్మకంగా 3 టీమ్‌‌ క్రికెట్‌‌ను సౌతాఫ్రికా శనివారం పరిచయం చేసింది.

క్రికెట్‌లో మరో కొత్త ఫార్మాట్..  3 టీమ్‌‌ క్రికెట్‌ సక్సెస్‌‌‌‌
Follow us

|

Updated on: Jul 19, 2020 | 5:45 PM

ఇన్నాళ్లు క్రికెట్‌‌ మ్యాచ్‌‌ అంటే.. రెండు జట్ల మధ్య పోటీ. లిమిటెడ్‌‌ ఓవర్ల ఫార్మాట్‌‌ అయితే చెరో ఇన్నింగ్స్‌‌.. టెస్టుల్లో రెండు ఇన్నింగ్స్‌‌ల్లో పోటీ పడటం చూశాం. ఫార్మాట్ ఏదైనా.. మరెన్ని ఫార్మాట్లు పుట్టుకొచ్చినా రెండు జట్లు తలపడటమే చూశాం. కానీ కరోనా టైమ్‌‌లో వినూత్న ఆలోచన చేసింది సౌతాఫ్రికా క్రికెట్‌‌ బోర్డు. నమ్మశక్యం కాని ఫార్మాట్‌‌ను తెరపైకి తెచ్చింది. 3 టీమ్‌‌ క్రికెట్‌‌ (3TC) పేరిట.. ఎనిమిదేసి ప్లేయర్లు ఉన్న మూడు జట్లతో 36 ఓవర్ల మ్యాచ్‌‌కు ప్లాన్‌‌ చేసింది. ప్రయోగాత్మకంగా 3 టీమ్‌‌ క్రికెట్‌‌ను సౌతాఫ్రికా శనివారం పరిచయం చేసింది.

సౌతాఫ్రికా కొత్తగా ప్రవేశపెట్టిన 3 టీమ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఫార్మాట్ (3టీసీ) ప్రయోగం సక్సెస్‌‌‌‌ అయింది. సాలిడారిటీ కప్‌‌‌‌ పేరుతో నిర్వహించిన ఎగ్జిబిషన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా సాగింది. సౌతాఫ్రికా స్టార్క్రికెటర్లంతా బరిలోకి దిగిన ఈ పోరులో పరుగుల మోతెక్కింది. ఐడెన్‌‌‌‌ మార్క్రమ్‌‌‌‌ (33 బంతుల్లో 70), ఏబీ డివిలియర్స్‌‌‌‌ (24 బంతుల్లో 61) మెరుపు హాఫ్సెంచరీలతో ముందుండి నడిపించడంతో టాప్‌‌‌‌ స్కోరర్గా నిలిచిన ఈగల్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ నెగ్గింది.

టెస్టు, వన్డే, టీ20, టీ10.. క్రికెట్‌‌లో మనకు తెలిసిన ఫార్మాట్లు. ఈ లిస్ట్‌‌లో ఇప్పుడు కొత్త ఫార్మాట్‌‌ చేరింది. మిగతా ఫార్మాట్లకు పూర్తి భిన్నంగా ఒక మ్యాచ్‌‌లో మూడు జట్లు తలపడేలా రూపొందించింది. 36 ఓవర్లలో మూడు జట్లు.. రెండు అర్ధ భాగాల్లో తలపడ్డ సాలిడారిటీ కప్‌‌ ఎగ్జిబిషన్‌‌ మ్యాచ్‌‌ హిట్టయింది. కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించిన ఈ మ్యాచ్‌‌లో సఫారీ సూపర్ స్టార్ఏబీ డివిలియర్స్‌‌ కెప్టెన్సీలోని ఈగల్స్ టీమ్‌‌ గెలుపొందింది. 12 ఓవర్లలో ఆ జట్టు అత్యధికంగా 160/4 స్కోరు చేసి గోల్డ్‌‌ గెలిచింది. టెంబా బవూమ నేతృత్వంలోని కైట్స్‌‌12 ఓవర్లలో 138/3 స్కోరుతో సెకండ్‌‌ ప్లేస్‌‌లో నిలిచి సిల్వర్ సాధించింది. రెజా హెండ్రిక్స్‌‌ నాయకత్వం వహించిన కింగ్‌‌ఫిషర్స్‌‌ 113/5తో థర్డ్‌‌ ప్లేస్‌‌తో బ్రాంజ్‌‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కరోనా బారినపడ్డ క్రికెట్‌‌ కమ్యూనిటీకి అందజేయాలని నిర్ణయించారు. రేసిజానికి వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్‌‌ లైవ్స్‌‌ మ్యాటర్’ ఉద్యమానికి మద్దతుగా ఈ ఈవెంట్‌‌కు సాలిడారిటీ కప్‌‌ అని పేరు పెట్టారు. మ్యాచ్‌‌ ముందు క్రికెటర్లంతా మోకాళ్లపై కూర్చొని తమ సంఘీభావం ప్రకటించారు.

36 ఓవర్ల ఈ గేమ్‌‌ మొత్తం ఆరు ఇన్నింగ్స్‌‌గా విభజించారు. మూడు జట్లూ రెండు సార్లు 6 ఓవర్ల చొప్పున తలో 12 ఓవర్లు బ్యాటింగ్‌‌ చేశాయి. ఫస్ట్‌‌ ఆరు ఓవర్లు అయిపోయిన తర్వాత ఎక్కువ రన్స్‌‌ చేసిన జట్టు సెకండాఫ్‌‌లో ఫస్ట్‌‌ బ్యాటింగ్‌‌ చేసింది. సెకండ్‌‌ హైయెస్ట్‌‌ స్కోరర్, తర్వాత థర్డ్‌‌ టీమ్‌‌ బ్యాటింగ్‌‌కు వచ్చాయి. ప్రతి ఇన్నింగ్స్‌‌లో ఆరుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతించారు. గ్రౌండ్‌‌ను ఆరు జోన్లుగా విభజించి ఒక్కో జోన్‌‌లో ఒక్కో ఫీల్డర్ను ఉంచారు. ప్రతి బౌలర్ కు మూడు ఓవర్లు మాత్రమే పరిమితం చేశారు. ఇలా రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో చివరికి డివిలియర్స్‌‌ కెప్టెన్సీలోని ఈగల్స్ టీమ్‌‌ గెలుపొందింది.

దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..