అక్కడ కారు కొంటే సబ్సిడీ..!

కరోనా రాకాసి కోరల్లోంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న వుహాన్ సిటీని చక్కదిద్దే పనిలో పడింది చైనా ప్రభుత్వం. 76 రోజల లాక్ డౌన్ తో ఆర్థికంగా కుదేలైన పరిశ్రమరంగానికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యంగా ఆటో రంగాన్ని గాడిలో పెట్టేందుకు అధికారులు సబ్సిడీలు ప్రకటించారు. వుహాన్ లో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసినవారికి 1000 యువాన్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు స్థానిక అధికారులు. పెట్రోల్, డిజిల్ తో నడిచే వాహనాలను కొనుగోలు చేస్తే 5 వేల యువాన్లు రాయితీ […]

అక్కడ కారు కొంటే సబ్సిడీ..!
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:40 PM

కరోనా రాకాసి కోరల్లోంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న వుహాన్ సిటీని చక్కదిద్దే పనిలో పడింది చైనా ప్రభుత్వం. 76 రోజల లాక్ డౌన్ తో ఆర్థికంగా కుదేలైన పరిశ్రమరంగానికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యంగా ఆటో రంగాన్ని గాడిలో పెట్టేందుకు అధికారులు సబ్సిడీలు ప్రకటించారు. వుహాన్ లో తయారయ్యే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసినవారికి 1000 యువాన్ల సబ్సిడీ ఇస్తామని ప్రకటించారు స్థానిక అధికారులు. పెట్రోల్, డిజిల్ తో నడిచే వాహనాలను కొనుగోలు చేస్తే 5 వేల యువాన్లు రాయితీ ఇస్తామని మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. అంతేకాదు వుహాన్ లో తయారయ్యే ఎయిర్ కండీషనర్లు, వాటర్ హీటర్లు, రిఫ్రీజిరేటర్లపై కూడా రాయితీలు పొందవచ్చని ప్రకటించారు.

చైనాలో పెద్ద నగరాల్లో ఒకటైన వుహాన్ సిటీ ఆటో రంగంతో పాటు ఎలక్ట్రిక్ ఉత్పత్తులకు పేరుగాంచింది. గత ఏడాది 15 లక్షల వాహనాలు ఉత్పత్తి జరిగింది. కరోనా కాటుకు దాదాపు 76 రోజులపాటు లాక్ డౌన్ లో ఉండిపోవడంతో అన్ని రంగాల్లో ఉత్పత్తులు అమ్మకాలు పూర్తిగా స్తంభించిపోయాయి. పరిశ్రమల రంగాన్ని ఆర్థికంగా కాస్త అయినా ఆదుకునేందుకు రాయితీలు ఇస్తున్నట్లు స్థానిక ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.