శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం కార్యక్రమం ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:53 pm, Fri, 20 November 20

Subramanya Swamy Homam : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం కార్యక్రమం ముగిసింది. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

దీనిలో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు.

ఈ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ నవగ్రహ కలశస్థాపన, హోమం, లఘుపూర్ణాహుతి, విశేష దీపారాధన చేశారు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి స్కంద ష‌ష్ఠ ‌సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 7 గంట‌ల వ‌ర‌కు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం ఏకాంతంగా నిర్వహించారు.