Breaking News
  • విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర ఉద్రిక్తత. ధర్నాచౌక్‌ నుంచి మందడం బయల్దేరిన కర్నాటక రైతులు. అనుమతిలేదంటూ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర అడ్డుకున్న పోలీసులు.
  • చంద్రబాబుతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ భేటీ. అమరావతి కార్యాచరణపై చర్చ.
  • మైలవరం ఫారెస్ట్ అధికారిపై వైసీపీ మండలాధ్యక్షుడు దాడికియత్నం. అటవీ భూమిని చదును చేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ అధికారి . ఫారెస్ట్‌ అధికారితో వాదనకు దిగిన వైసీపీ నేత పామర్తి శ్రీను.
  • ప.గో: చంద్రబాబుది యూటర్న్‌ గవర్నమెంట్‌ అయితే.. జగన్‌ది రద్దుల గవర్నమెంట్‌. మంగళగిరిలో లోకేష్‌ ఓడిపోయి.. మండలిలోకి వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు అడుకుంటున్నారు. రాజకీయ పునరావాసానికి మండలి వేదికగా మారింది-బీజేపీ నేత అంబికా కృష్ణ.
  • తూ.గో: తునిలో కారులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు. మూడేళ్ల బాబును కారులో వదిలి వెళ్లిన తల్లిదండ్రులు. కారు డోర్లు లాక్‌ కావడంతో ఉక్కిరిబిక్కిరైన బాలుడు. కారు అద్దాలు పగలగొట్టి చిన్నారిని కాపాడిన స్థానికులు.

సబ్ కలెక్టెర్‌ రేణూకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే

, సబ్ కలెక్టెర్‌ రేణూకు క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్యే

తిరువనంతపురం: పాలనా వ్యవస్థ, అధికారిక వ్యవస్థ రెండూ ముఖ్యమే. రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు. వాటిని అధికారులు క్షేత్ర స్థాయిలో అమలు చేస్తారు. అయితే అధికారులపై రాజకీయ నాయకులు జులుం ప్రదర్శిస్తుంటారు. వారి పనులకు అడ్డం వస్తే కన్నెర్ర చేస్తారు.

తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి కేరళలో జరిగింది. దేవికుళం సబ్ కలెక్టర్‌గా పని చేస్తున్న రేణూ రాజ్‌ను దేవికుళం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేంద్రన్‌ తిట్టారు. నీకసలు బుర్రలేదని, బుద్ధిలేదంటూ నోరు పారేసుకున్నారు. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏమంటే అనుమతులు లేకుండా కడుతున్న షాపింగ్ కాంప్లెక్స్‌ను అడ్డుకోవడమే.

‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ లేకుండా ఆ కాంప్లెక్స్‌ను కడుతున్నారని తెలుసుకున్న సబ్ కలెక్టర్ రివెన్యూ సిబ్బందితో వెళ్లి అడ్డుకున్నారు. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూడా తన అనుచరులతో వెళ్లి అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంలోనే ఆమెపై కలెక్టర్ మాటల దాడికి దిగారు.

దీంతో రివెన్యూ డిపార్ట్‌మెంట్ కార్యదర్శికి, కలెక్టర్‌కు రేణూ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే తీరుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగింది. దీంతో ఎమ్మెల్యే రాజేంద్రన్ సబ్ కలెక్టర్ రేణూకి క్షమాపణలు చెప్పారు.

మెడిసన్ చదువుకున్న రేణూ కొంత కాలంపాటు వైద్యురాలిగా పని చేసింది. అయితే 2015లో జరిగిన ఐఏఎస్ పరీక్షలకు హాజరై తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది.