గుంటూరులో స్టూడెంట్ వార్..ఒకరి మృతి

గుంటూరులో స్టూడెంట్ వార్ కలకలం సృష్టిస్తోంది.  ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో..ఒకరు గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు విడవడం చర్చనీయాంశమైంది. దీంతో పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థి సంఘాలు, బంధువులు ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై కాలేజీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన నవీన్‌, మంగళదాస్‌ నగర్‌కు చెందిన మాథ్యూస్ కొత్తపేటలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం లంచ్ […]

గుంటూరులో స్టూడెంట్ వార్..ఒకరి మృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 03, 2020 | 5:23 PM

గుంటూరులో స్టూడెంట్ వార్ కలకలం సృష్టిస్తోంది.  ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో..ఒకరు గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు విడవడం చర్చనీయాంశమైంది. దీంతో పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్న విద్యార్థి సంఘాలు, బంధువులు ఆందోళనకు దిగారు. జరిగిన ఘటనపై కాలేజీ యాజమాన్యంపై అనుమానం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని ఆర్టీసీ కాలనీకి చెందిన నవీన్‌, మంగళదాస్‌ నగర్‌కు చెందిన మాథ్యూస్ కొత్తపేటలోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్మీడియెట్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న మధ్యాహ్నం లంచ్ బ్రేక్‌ టైమ్‌లో కలుసుకుని…ఇద్దరూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. ఈ క్రమంలో సరదాగా ప్రారంభమైన గొడవ కాస్తా, సీరియస్‌గా మారింది. ఆవేశంలో మాథ్యూస్‌.. నవీన్‌ మెడపై బలంగా కొట్టడంతో అతడు అపస్మారక స్థితిలో కిందపడిపోయాడు. తోటి విద్యార్థులు గమనించి సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో వెంటనే అతన్ని స్థానిక రమేష్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్‌ మృతి చెందాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు, విద్యార్థి సంఘాలు హుటాహుటినా ఆస్పత్రికి చేరుకున్నారు. ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు పోయే స్థాయిలో ఎలా కొట్టుకుంటారంటూ బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. వాస్తవాలను వెలికితీయాలని పట్టుబట్టారు. జరిగిన ఘటనపై ఎన్‌ఆర్‌ఐ కాలేజీ యాజమాన్యం ఆరా తీసింది. నవీన్‌పై దాడి చేసిన మాథ్యూస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.