అక్కడ 15 ఏళ్ల లోపు పిల్లల‌కు సెల్‍ఫోన్ నిషేధం

స్మార్ట్‌ఫోన్ మనిషి జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది లేకపోతే జీవితమే వ్యర్దం అనుకునే స్థాయికి వచ్చేశాం. అయితే ఇప్పుడిప్పుడే వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 15 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ అవరణలో సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. అది భోజన సమయమైన కూడా అంతే. దీని కోసం ఆ దేశం ఒక చట్టమే తీసుకువచ్చింది. ఈ […]

అక్కడ 15 ఏళ్ల లోపు పిల్లల‌కు సెల్‍ఫోన్ నిషేధం
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2019 | 11:42 AM

స్మార్ట్‌ఫోన్ మనిషి జీవన విధానంలో ఒక భాగమైపోయింది. ఇది లేకపోతే జీవితమే వ్యర్దం అనుకునే స్థాయికి వచ్చేశాం. అయితే ఇప్పుడిప్పుడే వీటి వల్ల పొంచి ఉన్న ప్రమాదాలను పసిగట్టి తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 15 ఏళ్ల లోపు స్కూల్ పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్ అవరణలో సెల్ ఫోన్ ఉపయోగించకూడదు. అది భోజన సమయమైన కూడా అంతే. దీని కోసం ఆ దేశం ఒక చట్టమే తీసుకువచ్చింది.

ఈ చట్టం ప్రకారం సెల్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి వేటిని కూడా వాడరాదు. స్కూల్‌లో క్లాస్ సమయంలో ఫోన్లు వాడకూడదనే చట్టం అక్కడ 2010 నుంచే అమలులో ఉంది. అయితే ఇప్పుడు బ్రేక్స్, మీల్‌టైమ్స్‌లో కూడా సెల్‌ఫోన్లను వాడరాదని చట్టం చేశారు. అయితే దివ్యాంగుల విషయంలో ఈ నిబంధనల్లో కొంత సడ‌లింపు ఉంది. విద్యార్థులు ఫోన్లకు బానిసలు కారాదని ఆ దేశం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది.