చెట్లు నరికినా సమర్థిస్తారా.. బిగ్‌‌బీ ఇంటి వద్ద విద్యార్థుల నిరసన

Protest Against Amitabh Bachchan, చెట్లు నరికినా సమర్థిస్తారా.. బిగ్‌‌బీ ఇంటి వద్ద విద్యార్థుల నిరసన

బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ముంబైలో ఆరే మెట్రో నిర్మాణం కోసం చెట్లు నరకడాన్ని అమితాబ్ సమర్థించడంతో పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. అమితాబ్ తీరును వ్యతిరేకిస్తూ.. ముంబైలోని ఆయన ఇంటి వద్ద ఆందోళన నిర్వహించారు. ఇప్పటికే మెట్రో నిర్మాణం కోసం వేలాది చెట్లను నరికివేశారని.. పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. అబితాబ్ లాంటి సెలబ్రిటీ చెట్లు నరకడాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా, మెట్రో ప్రాజెక్టు కోసం ముంబైలోని అటవీ ప్రాంతంలో 2,700 చెట్లను నరకాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *