Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • 10 గంటలకు రాజభవన్ వెళ్లనున్న సీఎం కెసిఆర్.... రాష్ట్రావతరణ దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వక భేటీ... గవర్నర్ పుట్టినరోజు సందర్బంగా శుభాకాంక్షలు చెప్పనున్న సీఎం....
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • విశాఖ: ఎల్జీ పాలిమర్స్ విషవాయువు ప్రభావం.. మరొకరి మృతి. కనకరాజు అనే వ్యక్తికి తీవ్ర అస్వస్థత.. ఆసుపత్రుకి తరలిస్తుండగా మృతి. ఘటన జరిగిన సమయంలో తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరి కోలుకుమ్మ కనకరాజు. 2 రోజులుగా ఆయాసం, కడుపు ఉబ్బరంతో బాధపడుతూ కనకరాజు మృతి. విషవాయువు ప్రభావం వల్లే కనకరాజు మృతిచెందాడంటున్న బంధువులు. మృతదేహం మార్చురీకి తరలింపు.
  • అమరావతి: సచివాలయంలో ని 4 బ్లాక్ లో విధులు నిర్వహించే వ్యవసాయ శాఖ ఉద్యోగుల అందరికి హోమ్ క్వరంటాయిన్ సూచిస్తూ వ్యవసాయ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య ఉత్తర్వులు . వ్యవసాయ శాఖ లోని ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడం తో ఈ చర్యలు సూచిస్తూ ఆదేశాలు. జూన్ 1 తేదీ నుంచి 14 తేదీ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిందిగా స్పష్టం చేస్తూ ఉత్తర్వులు.
  • తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు ...94. రాష్ట్రంలో లోకల్ కేసులు 2264. ఇప్పటివరకు తెలంగాణలో నమోదైన మొత్తం కేసులు 2792.

విమాన ప్రయాణ రూల్స్ ఇక మరింత కఠినం !

Strict Rules For Flight Passengers, విమాన ప్రయాణ రూల్స్ ఇక మరింత కఠినం !

కరోనా వైరస్ ఇంకా ‘బలంగానే’ ఉండడంతో.. విమాన ప్రయాణికులకు ఎయిర్ పోర్ట్ అథారిటీ మరిన్ని నిబంధనలను పాటించాలని సూచిస్తోంది. విమానంలో ఇక భోజన (ఫుడ్) సౌకర్యం ఉండదని, అలాగే వారు తమ సొంత ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. ప్రతి సీటు వద్ద మంచి నీళ్ల బాటిల్స్ మాత్రం ఉంటాయని వెల్లడించింది. టర్మినల్ బిల్డింగ్ లో ఎక్కడా న్యూస్ పేపర్లు గానీ, మ్యాగజైన్లు గానీ ఉండరాదని, వెబ్-చెక్ ను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. ఒక ప్రయాణికునికి ఒక చెక్ మాత్రమే అనుమతి ఉంటుంది. బ్యాగేజీ ట్యాగ్ ని ప్రింట్ చేసి లగేజీకి ఎటాచ్ చేయవలసి ఉంటుంది. ప్రయాణానికి గంట ముందు బ్యాగ్ ను డ్రాప్ చేయాల్సి ఉంటుంది.

ప్యాసింజర్ల బూట్లు, పాదరక్షలను డిస్ ఇన్ఫెక్ట్ చేయడానికి అనువుగా టర్మినల్ బిల్డింగ్ ఎంట్రెన్స్ లో మ్యాట్స్ లేదా కార్పెట్లను సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో తడిపి ఉంచాలి. ప్యాసింజర్లు భౌతిక దూరాన్ని పాటించేందుకు..ఖాళీగా ఉన్న సీట్లను మార్కర్స్ లేదా టేప్స్ తో అతికించవలసి ఉంటుంది. రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ చెక్-ఇన్ కౌంటర్లను వినియోగించుకోవాలి. ఎయిర్ పోర్ట్ స్టాఫ్ కి కిట్లు, హ్యాండ్ శానిటైజర్లు తప్పనిసరి. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు సాద్యమైనంత వరకు విమాన ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. రద్దీ నివారణకు టర్మినల్ ఎంట్రీ గేట్లన్నీ తెరచి ఉంచాలి..

 

Related Tags