క‌రోనా విధులు త‌ట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ విధులు నిర్వ‌హిస్తున్న వైద్య‌సిబ్బంది, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, పోలీసుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి..విధి నిర్వ‌హ‌ణ‌లో

క‌రోనా విధులు త‌ట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
Follow us

|

Updated on: Apr 15, 2020 | 9:53 AM

క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టిస్తోన్న విల‌యం అంతాఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లుతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. విద్యా,ఉద్యోగ‌, ర‌వాణా రంగాలు స్తంభించిపోయాయి. దేశ ఆర్థిక ప‌రిస్థితి పాతాళానికి ప‌డిపోతోంది. రెక్కాడితే గానీ, డొక్కాడ‌ని నిరుపేద‌ల క‌ష్టాలు ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇదిలా ఉంటే, క‌రోనా క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ విధులు నిర్వ‌హిస్తున్న వైద్య‌సిబ్బంది, శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, పోలీసుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. రాత్ర‌న‌క ప‌గ‌ల‌న‌క డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బంది ఒత్తిడి త‌ట్టుకోలేక పోతున్నారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ పోలీసు ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. వివ‌రాల్లోకి వెళితే…
పోలీసు ఉద్యోగి బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ నేపథ్యంలో విదుల ఒత్తిడి తట్టుకోలేక కానిస్టుబుల్ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు.  లాక్ డౌన్ విధించినప్పటి నుంచి విధుల‌లో ఉన్న కానిస్టేబుల్ ఒకరు ఒత్తిడి తట్టుకోలేక తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యా యత్నం చేశాడు. భోపాల్ లో విధి నిర్వహణలో ఉన్న చేతన్ సింగ్ అనే కానిస్టుబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ కానిస్టేబుల్‌ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కోలుకుంటున్నారు.