అస్ట్రేలియాలోని వీధులకు కపిల్, సచిన్, కోహ్లీ పేర్లు

అస్ట్రేలియాలోని వీధులకు ప్రపంచ మేటి క్రికెటర్ల పేర్లు. సొమ్ము చేసుకుంటున్న ఏస్టేట్ నిర్వహకులు.

అస్ట్రేలియాలోని వీధులకు కపిల్, సచిన్, కోహ్లీ పేర్లు
Follow us

|

Updated on: Jun 15, 2020 | 5:40 PM

క్రికెట్ తో భారతదేశానికి కీర్తి తెచ్చిపెట్టిన పేర్లకు అస్ట్రేలియాలో మంచి గిరాకీ లభిస్తోంది. అస్ట్రేలియాకు చెంది ఓ రియల్ ఏస్టేట్ వ్యాపారి నిర్మిస్తున్న ఏస్టేట్ కి మనవారి పేర్లు పెట్టుకున్నారు. దీంతో అమ్మకాలు చురుక్కుగా సాగుతున్నాయట. ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకున్న ఇండియన్ క్రికెటర్స్ సచిన్‌ తెందుల్కర్‌, కపిల్‌ దేవ్‌, విరాట్‌ కోహ్లీ పేర్లతో ఏకంగా వీధులు కనిపిస్తున్నాయి. మెల్‌బోర్న్‌లో రాక్‌బ్యాంక్‌ ప్రాంతంలోని ఓ ఎస్టేట్‌లోని వీధులకి ‘తెందుల్కర్‌ డ్రైవ్‌’, ‘కోహ్లీ క్రెసెంట్‌’, ‘దేవ్‌ టెర్రెస్‌’ అని పేర్లు పెట్టేసుకున్నారు. మెల్టన్‌ కౌన్సిల్ పరిధిలోని ప్రాంతంలో భారత్‌కు చెందిన వారు ఎక్కువగా ఇష్టపడి ఏస్టేట్స్ కొనుగోళ్లు జరుపుతున్నారట. భారత క్రికెటర్లతో పాటు ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్ల పేర్లు కూడా ఎస్టేట్‌లోని వీధులకి పెట్టారు. వా స్ట్రీట్‌, మియాందాద్‌ స్ట్రీట్‌, అంబ్రోస్‌ స్ట్రీట్‌, సొబెర్స్ డ్రైవ్‌, కలిస్‌ వే, హాడ్లీ స్ట్రీట్‌, అక్రమ్‌ వే అని పెట్టారు. ఇలా క్రికెటర్ల పేర్లు పెట్టడంతో భారతీయుల నుంచి భారీ స్పందన వస్తుందని, అధికంగా అమ్మకాలు జరుగుతున్నాయని ఎస్టేట్‌ నిర్వహణాధికారి ఒకరు తెలిపారు. ఎంఎస్ ధోనీ, రాహుల్ ద్రవిడ్‌, కుమార సంగక్కర పేర్లను ప్రతిపాదించగా కొన్ని కారణాలతో అనుమతి లభించలేదని నిర్వహకులు పేర్కొన్నారు. కోహ్లీకి వీరాభిమానని, ఖరీదైన ప్రాంతానికి అతడి పేరుని పెట్టినట్లు తెలిపారు. ఎస్టేట్‌ సంస్థ ప్రతిపాదించిన వీధి పేర్లను సిటీ కౌన్సిల్‌ ఆమోదిస్తుంది. అయితే తమకు నచ్చిన పేర్లను సూచించేందుకు అవకాశం ఏస్టేట్ సంస్థలకు ఉంది.