Breaking News
  • ఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌ల గడువు పొడిగింపు . 2019-20 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్‌ల దాఖలకు గడువు పెంపు . పన్ను రిటర్న్‌లకు 2021 జనవరి 31 గడువు పెంపు . ప్రకటించిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ . కోవిడ్‌-19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు మరింత సమయం .
  • విజయవాడ: ఢిల్లీ నుండి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరకున్న కిషన్‌రెడ్డి . స్వాగతం పలికిన బీజేపీ రాష్ట్ర నాయకులు . హైందవి కార్యాలయంలో పాల్గొననున్న కిషన్‌రెడ్డి . రాత్రికి హోటల్లో బస..రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న మంత్రి . తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి . అనంతరం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి పయనం .
  • కరోనా బాధితులు, ఫ్రంట్‌లైన్‌ వారియర్లతో చంద్రబాబు వెబినార్‌. కరోనా ఉధృతిపై రోజువారీ ఆడిట్‌ చేసుకోవాలి . సమర్థవంతంగా హ్యాండిల్‌ చేయగలిగేవారే సంక్షోభం అధిగమించగలరు . కరోనా కష్టకాలంలో మనవంతు బాధ్యతలను నిర్వహిస్తున్నాం. కేసుల సంఖ్యలో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది . మరణాల సంఖ్యలో దేశంలోనే ఏపీది 5వ స్థానం . దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న 30 జిల్లాల్లో 5 జిల్లాలు ఏపీవే .
  • మెదక్‌ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో విషాదం . ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి. పాపన్నపేట మండలం అన్నారం గ్రామంలో ఘటన . బతుకమ్మను చెరువులో వదిలేందుకు వెళ్లి మునిగిన యువకుడు .
  • అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త . డీఏ విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌. 2018 జూలై నుంచి 2019 డిసెంబర్‌ వరకు పెండింగ్‌లో ఉన్న.. మూడు డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌. కరోనా కారణంగా వాయిదా వేసిన మార్చి, ఏప్రిల్‌ నెల.. సగం జీతాలను 5 విడదల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం .
  • జమ్మూకశ్మీర్‌: గుపాకర్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడిగా ఫరూక్‌ అబ్దుల్లా. పేరును ప్రతిపాదించిన మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ. ఆర్టికల్‌ 370 రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ముఫ్తీ. కేంద్రం తీరును నిరసిస్తూ కొత్త ఫ్రంట్‌ ఏర్పాటు .
  • ఢిల్లీ:దేశ ప్రజలకు విజయదశిమి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి . చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నమే విజయదశిమి . కోవిడ్‌ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలి-వెంకయ్యనాయుడు .

టీడీపీ, వైసీపీ మధ్య వర్గపోరు.. కత్తులతో దాడులు

కడప జిల్లా కమలాపురంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. పరస్పరం కత్తులు, గడ్డపారలతో దాడులకు తెగబడి స్థానికులను బెంబేలెత్తించారు.

street fight between TDP YCP, టీడీపీ, వైసీపీ మధ్య వర్గపోరు.. కత్తులతో దాడులు

కడప జిల్లా కమలాపురంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. పరస్పరం కత్తులు, గడ్డపారలతో దాడులకు తెగబడి స్థానికులను బెంబేలెత్తించారు. పోలీసులు రంగంలోకి దిగి అతికష్టం మీద పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే వుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కమలాపురం గిడ్డంగి వీధి సీతాలమ్మ గుడి వద్ద శనివారం ఉదయం ఉద్రిక్తత ఏర్పడింది. ఓ వివాదాస్పద స్థలం విషయంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ శ్రేణులు పరస్పరం గొడవకు దిగడంతో వర్గపోరు మొదలైంది. కత్తులు, గడ్డపారలతో ఇరు వర్గాలు మధ్య పరస్పర దాడులకు తెగబడ్డాయి. ఈ దాడిలో రెండు గ్రూపులకు సంబంధించిన కొందరికి గాయాలయ్యాయి. స్థానికులు బెంబేలెత్తిపోయారు. కాసేపు రెండు వర్గాలు భీకర స్థాయిలో పరస్పరం దాడులకు తెగబడ్డారు.

భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో వారు రంగంలోకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత కూడా రెండు వర్గాలు పరస్పరం దాడులను కొనసాగించాయి. పోలీసులు అతికష్టం మీద రెండు వర్గాలను తరిమి కొట్టడంతో గొడవ సద్దుమణిగింది. కానీ ఆ ప్రాంతం ఇంకా ఉద్రిక్తంగానే వుండడంతో పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Related Tags