కర్నూలు జిల్లాలో జోరు వానలు..

కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ, తెర్నెకల్‌లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెర్నెకల్ సమీపంలోని వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది.

కర్నూలు జిల్లాలో జోరు వానలు..
Follow us

|

Updated on: Oct 01, 2020 | 5:34 PM

Heavy Rains : కర్నూలు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దేవనకొండ, తెర్నెకల్‌లో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. తెర్నెకల్ సమీపంలోని వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఉప్పొంగి ప్రవహిస్తున్న నది.. చూట్టూ వరదనీరు.. నది మధ్యలో 10 మంది.. 2వేల గొర్రెలు.. ఇది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం గోరంట్లలో పరిస్థితి.

వరద ఉధృతి లేని సమయంలో గొర్రెలు కాసేందుకు వెళ్లారు కాపరులు. వెనక్కి తిరిగి వచ్చేలోగా నది ఉగ్రరూపం దాల్చింది. గొర్రెలతోపాటు పదిమంది అక్కడే ఉండిపోయారు. గొర్రెల కాపరులను కాపాడేందుకు స్థానికులు సైతం అధికారులకు సహకరిస్తున్నారు.

రాత్రి నుంచి తిండి లేక అవస్థలు పడ్డ కాపరులకు ఓ రెస్క్యూ బోటు ద్వారా ఆహారం, మంచినీళ్లను అందించారు. నది మధ్యలో ఉన్న ఎత్తైన ప్రాంతంలో గొర్రెలు, కాపరులు ఉన్నారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.