సూర్యుడి చుట్టూ వింతవలయం.. ఆశ్చర్యపోయిన జనం

Strange Circle Around sun in nalgonda district, సూర్యుడి చుట్టూ వింతవలయం.. ఆశ్చర్యపోయిన జనం

సోమవారం మిట్టమధ్యాహ్నం సూర్యుడు విపరీతంగా మండిపోతున్న సమయంలో నల్గొండలో వింత చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఓ వింతవలయం ఆక్రమించడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా చంద్రుడి చుట్టూ వరదగూడు అనే వలయం ఏర్పడుతుంటుంది. కానీ ఈరోజు భగభగ మండే భానుడి చుట్టూ ఓ వింత వలయం ఏర్పడింది. మిట్ట మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా సూర్యుడి చుట్టూ ఓ వలయం కనిపించింది. సుమారు రెండు గంటల పాటు ఈ వలయం అలానే ఉంది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఇది స్పష్టంగా కనిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *