‘నన్ను రక్షించరూ ?’… వూహాన్ సిటీలో ఏపీ అమ్మాయి వ్యధ

కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీలో ఏపీ అమ్మాయి ఒకరు తనను కాపాడాలంటూ వేడుకుంటోంది. కర్నూలుకు చెందిన అన్నెం జ్యోతి అనే ఈ యువతికి ఈ నెల 18 న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కొంతకాలంగా వూహాన్ నగరంలో ఉన్న ఈమెకు కరోనా వ్యాధి సోకిందన్న అనుమానంతో ఈమెను భారత్ కు తీసుకువచ్చేందుకు ఎయిరిండియా విమాన సిబ్బంది, డాక్టర్లు నిరాకరించారు. ఆ సిటీలో చిక్కుబడిన భారతీయుల్లో మొదటి విడతగా 324 మందిని తీసుకురావడానికి […]

'నన్ను రక్షించరూ ?'... వూహాన్ సిటీలో ఏపీ అమ్మాయి వ్యధ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 03, 2020 | 1:17 PM

కరోనా వైరస్ తో తల్లడిల్లుతున్న చైనాలోని వూహాన్ సిటీలో ఏపీ అమ్మాయి ఒకరు తనను కాపాడాలంటూ వేడుకుంటోంది. కర్నూలుకు చెందిన అన్నెం జ్యోతి అనే ఈ యువతికి ఈ నెల 18 న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే కొంతకాలంగా వూహాన్ నగరంలో ఉన్న ఈమెకు కరోనా వ్యాధి సోకిందన్న అనుమానంతో ఈమెను భారత్ కు తీసుకువచ్చేందుకు ఎయిరిండియా విమాన సిబ్బంది, డాక్టర్లు నిరాకరించారు. ఆ సిటీలో చిక్కుబడిన భారతీయుల్లో మొదటి విడతగా 324 మందిని తీసుకురావడానికి గతవారం ఎయిరిండియా విమానం అక్కడికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే జ్యోతికి కరోనా లక్షణాలున్నాయని అనుమానించిన వారు.. రెండో బ్యాచ్ లో ఆమెను తీసుకువెళ్తామని చెప్పారట. కానీ రెండో సారి వెళ్లిన విమాన సిబ్బంది కూడా జ్యోతిని తీసుకువచ్చేందుకు నిరాకరించారు. నిజానికి తనకు స్వల్ప జ్వరం మాత్రమే ఉందని, ఈ వ్యాధి లక్షణాలు లేవని జ్యోతి చెబుతున్నా ఫలితం లేకపోయింది. తాను ఎలాంటి టెస్టులకోసమైనా సిధ్ధమేనని, దయచేసి తనను ఇక్కడినుంచి తరలించాలని జ్యోతి దీనంగా కేంద్రాన్ని వేడుకుంటోంది.