చంద్రబాబుకు సపోర్టుగా ప్రచారవ్యూహ కర్త… ఆయనెవరంటే..?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఇప్పటినుంచే తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందా..? అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోందా..? వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పొలిటికల్‌ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా..? అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసమే, అధికారం కోల్పోగానే చంద్రబాబు పీకేను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే […]

చంద్రబాబుకు సపోర్టుగా ప్రచారవ్యూహ కర్త... ఆయనెవరంటే..?
Follow us

| Edited By:

Updated on: Sep 24, 2019 | 1:38 PM

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ఇప్పటినుంచే తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోందా..? అధికార పార్టీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోందా..? వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు పొలిటికల్‌ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా..? అన్న ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసమే, అధికారం కోల్పోగానే చంద్రబాబు పీకేను కలిసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వైసీపీ పార్టీకి పనిచేసే ఒప్పందం ఉండటం వల్ల ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఏ పార్టీ కోసం పనిచేస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రచారం వచ్చింది.

ఇక ప్రశాంత్ కిషోర్ స్థానంలో టీడీపీ కోసం పనిచేసేందుకు.. గతంలో ఐప్యాక్‌లోనే పనిచేసిన రాబిన్ శర్మను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇక రాబిన్ శర్మ విషయానికొస్తే.. ఆయన పీకే టీం నుంచి బయటికి వచ్చిన తర్వాత సొంతంగా పొలిటికల్ సర్వే సంస్థని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. పార్టీ కోసం పనిచేయడానికి రూ.50 కోట్లతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాబిన్ శర్మ పని ప్రారంభించారని.. టీడీపీకి సంబంధించిన ప్రతి అంశాన్ని మీడియాకి అందజేయడం, జాతీయ స్థాయిలో టీడీపీకి కవరేజ్ దొరికేలా చేయడంలో సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది. మరి పీకే శిష్యుడైన రాబిన్ శర్మ టీడీపీ అధికారం అందేలా చేయడంలో ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి.