Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు . రుతుపవనాల కు తోడైన రెండు ఉపరితల ఆవర్తనాలు. వాయువ్య బంగాళాఖాతం , గాంగేటిక్ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం -హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • శ్రీశైలం లో కరోనా కలకలం. ఆలయ ఉద్యోగులకు కూడా కరోనా సోకడంతో ఈరోజు నుంచి వారం రోజుల పాటు భక్తులందరికీ శ్రీశైలం ఆలయ దర్శనం నిలిపివేత. ఇప్పటికే ఎండోమెంట్ కమిషనర్, కర్నూలు కలెక్టర్ తో అనుమతి తీసుకున్న ఈఓ రామారావు.
  • బంజారాహిల్స్ లో 50 కోట్లు విలువైన లాండ్ కేసులో కొత్త కోణం . ఎకరా 20 గుంటలకు చెందినా ల్యాండ్ పత్రాలన్ని నకిలీవి గా తేల్చిన ఏసీబీ.  కోర్ట్ కి అందజేసిన పత్రాలు అన్ని ఫోర్జరీ , నకిలీ గా విచారణ లో వెల్లడి .

తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకు ముట్టని బాలుడు.. అయినా చలాకీగానే..

అన్నం తినమంటే ఆమడదూరం పరిగెడతాడు... కుర్‌కురేలు ఇస్తే కరకరలాడిస్తాడు... తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే ముట్టని బాలుడు... వింతగా ఉన్నా, ఇది సంతమాగులూరు మండలం సజ్జాపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడి కధ
wonder boy, తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకు ముట్టని బాలుడు.. అయినా చలాకీగానే..

అన్నం తినమంటే ఆమడదూరం పరిగెడతాడు… కుర్‌కురేలు ఇస్తే కరకరలాడిస్తాడు… తొమ్మిదేళ్లుగా అన్నం మెతుకే ముట్టని బాలుడు… వింతగా ఉన్నా, ఇది సంతమాగులూరు మండలం సజ్జాపురానికి చెందిన తొమ్మిదేళ్ల బాలుడి కధ… పుట్టినప్పటి నుంచి అన్నం అనేది తినకుండా కేవలం కుర్‌కురే, లేస్‌ లాంటి ప్యాకేజ్డ్‌ పదార్ధాలు, ఇడ్లీ, బోండా లాంటి తినుబండారాలు తిని కాలం నెట్టుకొస్తున్నాడు. అయినా చలాకీగానే ఉంటాడు… ఎంతమంది డాక్టర్లుకు చూపించినా… కొట్టినా, తిట్టినా తన ఇష్టప్రకారమే ఆహారం తీసుకుంటున్న పదేళ్ళ బాలుడి కధ ఇది.

ప్రకాశంజిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురం ఎస్సీ కాలనీకి చెందిన అనంతవరపు యాకోబు, ఏసమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు చార్లెస్‌. పదేళ్ళ వయసుగల ఈ బాలుడు ప్రస్తుతం రెండో తరగతి చదువుతున్నాడు. ఈ బాలుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం మెతుకు ముట్టలేదు. తల్లిపాలు ఇవ్వడం ఆపేసిన నాటి నుంచి కేవలం కుర్‌కురే ప్యాకెట్లు, బిస్కెట్లు వంటివి తింటూ మంచినీళ్లు తాగి సరిపెట్టుకుంటాడు. పండుగ వచ్చినా ఇంట్లో భోజనం పెడతామని తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా అన్నం పళ్లెం పక్కకు నెట్టివేయటం, కింద పడేయటం చేస్తుంటాడని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మనిషి అనే వ్యక్తి ఒక పూట సరైన భోజనం కానీ, అన్నం కానీ లేకపోతే ఆకలికి తాళలేడు. కానీ చార్లెస్ ఇన్ని సంవత్సరాల పాటు ఎందుకు ఇలా చేస్తున్నాడో.. కేవలం ప్యాకెట్లు తిని ఎలా వుంటున్నాడో కాలనీ వాసులకు అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. మళ్లీ అతను అందరిలాగే ఆడుకోవటం.. చురుగ్గానే ఉంటాడు. ఆదివారం వస్తే చికెన్‌తో అయినా భోజనం పెట్టాలని తల్లిదండ్రులు ప్రయత్నిస్తే రెండు చికెన్‌ ముక్కలు తినేసి భోజనం మాత్రం వద్దంటాడు. ఇంట్లో వాళ్లు మందలించినా మారాం చేయడం మినహా మార్పు మాత్రం రాలేదు.

తనకు అన్నం అంటే ఇష్టం లేదని కుర్‌కురేలు ఇస్తే చాలని బాలుడు చార్లెస్‌ చెబుతున్నాడు. నాకు అన్నం ఇష్టం లేదు…నేను ప్యాకెట్లు తింటానే తప్ప అన్నం నాకు పడదు. చిన్నప్పటి నుంచి అమ్మానాన్న అన్నం పెట్టినా తినే వాడిని కాదు. ఎన్నిసార్లు పెట్టాలని చూసినా ఇష్టం లేనిది తినబుద్ది కాలేదు. ప్యాకెట్లు, తింటూ మంచినీళ్లు తాగుతూ ఇలాగే వుండటం నాకిష్టం. అన్నం పెట్టమని ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టను. పెడతానంటే మాత్రం ఆ దరిదాపుల్లో లేకుండా పోతా అంటున్నాడు ఈ బాలుడు.

బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నం అంటే ఏదో విషాన్ని చూసినట్లుగా చూస్తున్నాడని చార్లెస్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు… ఇదేమిటో అంతుపట్టడం లేదు. ఎక్కడైనా డాక్టర్లుకు చూపిద్దామని తీసుకెళ్తున్నా సహకరించడు. అన్నం తినకపోవడం అనేది వాడికి ఒక శాపంగా మారింది. కూలీనాలీ చేసుకుంటే తప్ప మాకు ముద్ద నోటిలోకి పోదు.. మరో పక్క కొడుకు ఇలా అన్నం తినకుండా ఇన్నాళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్నా ఏం చేయలేకపోతున్నామని తల్లిదండ్రులు ఏసమ్మ, యాకోబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాలుడి ఈ వింత ప్రవర్తనతో ఆందోళన చెందిన కుటుంబం అతడ్ని పలుమార్లు వైద్యులకు చూపించారు. వైద్యుల పర్యవేక్షణలో అన్నం పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బాలుడు ఎప్పటికైనా మారతాడులే అన్న ఆశతో ఎదురు చూస్తున్నామని తాత పిచ్చయ్య చెబుతున్నాడు. అనంతవరపు చార్లెస్‌ అనే ఈ బాలుడు అన్నం తినకుండా కేవలం ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ తినటం వల్ల అతనికి భవిష్యత్‌లో పోషకాహార లోపం కలిగే ప్రమాదం ఉంటుంది. ఆ పరిస్ధితి రాకుండా భవిష్యత్‌లో తల్లిదండ్రులు అతని ఆలోచన మారే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ.. అతడు అన్నంతో పాటు పోషకాహారానికి అలవాటు పడేలా చేస్తే మంచిది.

Related Tags