ఈ చిన్నారి సాహసం.. తెలంగాణలో ఓ పాఠ్యాంశం

ఓ చిన్నారి చేసిన చిన్ని ప్రయత్నం ఇప్పడు ఎంతో మందికి ఆదర్శం. మకిళి పట్టిన 'దాల్ సరస్సు'ను శుభ్రం చేసింది. ఆ చిన్నారి జన్నత్ చేసిన సాహసం ఇప్పుడు పాఠ్యంశ్యంగా మారింది...

ఈ చిన్నారి సాహసం.. తెలంగాణలో ఓ పాఠ్యాంశం
Follow us

|

Updated on: Jun 24, 2020 | 7:41 PM

కశ్మీర్ కిరీటంలో కలికితురాయి. శ్రీనగర్ రత్నంగా ప్రజాదరణ పొందిన దాల్ సరస్సుకు ఓ చరిత్ర ఉంది. కాలానుగుణంగా ఆ సరస్సుకు మకిలి పట్టింది. వివిధ రకాల కారణాలతో ఆ సరస్సులో విహరించేవారు లేకుండా పోయారు. నెమ్మది.. నెమ్మదిగా సరస్సు కాస్తా.. నాచుతో నిండిపోయింది. గ్రీన్ లేక్ గా మారిపోయింది.

పర్యాటకులకు కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచే శ్రీనగర్‌లోని దాల్ సరస్సు కాలుష్య భూతం ఆవరించి దుర్గంధంతో నిండిపోయింది. పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న ఆ రోజుల్లో ఈ సుందరమైన సరస్సులో షికారు చేసేవారు.  ఇక్కడ విహరించడం ఓ ప్రత్యేకతగా భావించేవారు. ఇందులో విహరిస్తూ.. అద్భుతమైన అనుభూతి పొందేవారు. వివిధ కారణాలతో దాల్ సరస్సు టూరిస్టుల ఆదరణ కోల్పోయింది . ఇలా కళావిహీనంగా మారింది.

ఇదంతా ఇలా ఉంటే.. ఆ ప్రకృతి అందాలకు నిలయమైన ఆ సరస్సును శుద్ధి చేసేందుకు ఓ చిన్నారి సరస్సులోకి దిగింది. తన చిన్ని చేతులతో లేక్ ను శుభ్రం చేయడం మొదలు పెట్టింది. ఇలా గత రెండు సంవత్సరాలుగా తన తండ్రితో కలిసి చేస్తోంది. ఈ ఏడేళ్ల చిన్నారి జన్నాత్ చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ ప్రభుత్వం మెచ్చింది. జన్నాత్ స్టోరీ ఇప్పడు తెలంగాణ విద్యార్థులకు పాఠ్యాంశంగా మారింది.

ఈ విషయం తెలిసిన చిన్నారి మీడియాతో మాట్లాడుతూ.. ” నేను దాల్ సరస్సును శుభ్రం చేయడం వెనక నా తండ్రి ప్రేరణ ఉంది. నేను పొందుతున్న ఈ గుర్తింపు మా నాన్నగారి కారణంగానే “అని తెలిపింది.