Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • జమ్ము కాశ్మీర్లో బీజేపీ నేతపై ఉగ్రవాదుల కాల్పులు. బందీపూర్లో బీజేపీ నేత వసీం బారీపై కాల్పులు. కాల్పుల్లో బారీతో పాటు ఆయన సోదరుడు ఉమర్ సుల్తాన్, తండ్రి బషీర్‌కి కూడా గాయాలు.
  • అమారావతి: పది ప్రధాన ప్రాజెక్టులకు సంభందించి 198 పనులను ప్రీక్లోజర్ కు ప్రభుత్వం మొగ్గు. ప్రజెక్టుల పూర్తివ్యయ సమాచారం ఈ నెల 22లోగా ఇవ్వండంటూ ఆదేశం. కాంట్రాక్టు సంస్ధలకు చెల్లించిన మొత్తాలు, బ్యాంకు గ్యారెంటీలు, అడ్వాన్సులు, ముందస్తు బెంచి మార్కు విలువపై 22లోగా నివేదిక ఇవ్వాలంటూ జీవో ఉత్తర్వులు వెలువరించిన జలవనరుల శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆదిత్య నాధ్ దాస్.
  • ప్ర‌ముఖ న‌టుడు, హాస్య‌న‌టుడు జ‌గ్ దీప్ క‌న్నుమూత‌. స‌య్య‌ద్ ఇష్తియాక్‌ అహ్మ‌ద్ జాఫ్రీ అలియాస్ జ‌గ్‌దీప్ క‌న్నుమూశారు. ఆయ‌న‌కు 81 ఏళ్లు. 1939 మార్చి 29న జ‌న్మించిన జ‌గ్‌దీప్‌. 400ల‌కు పైగా చిత్రాల్లో న‌టించిన జ‌గ్‌దీప్‌. షోలే, పురాణ మందిర్‌, అందాజ్ అప్నా అప్నా చిత్రాల‌తో మంచి పేరు. బాల న‌టుడిగా బి.ఆర్‌.చోప్రా అఫ్సానాతో ప‌రిచ‌యం. అబ్ దిల్లి దూర్ న‌హీ, కె.ఎ.అబ్బాస్ చిత్రం `మున్నా`, గురు ద‌త్ చిత్రం `ఆర్ పార్‌`, భిమ‌ల్ రాయ్ చిత్రం `దో బిగా జ‌మీన్‌` చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించిన జ‌గ్‌దీప్.
  • జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజును సస్పెండు చేసినట్లు దేవదాయశాఖ కమిషనరు అర్జునరావు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అయి ఉండి పలువురు రాజకీయ నాయకులతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న నాయకులతో సాన్నిహిత్యాన్ని కొనసాగించడం, కోడి పందేల్లో పాల్గొనడం వంటి కారణాలతో సస్పెండు చేసినట్లు దేవదాయశాఖ సహాయ కమిషనరు పల్లంరాజు స్పష్టం చేశారు. తాడేపల్లిగూడెం డివిజన్‌ తనిఖీదారుడు టీవీఎస్‌ఆర్‌ ప్రసాదుకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలియజేశారు.
  • విశాఖ: కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కలకలం. టెస్ట్ లు నిర్బహించే ముగ్గురు టెక్నీషియన్లకు కరోనా పాజిటివ్. ల్యాబ్ లో సేవలందించే 20 మందికి పరీక్షలు.. అందరికీ నెగెటి. వైరాలజీ ల్యాబ్ లో సేవలు తాత్కాలికంగా నిలిపివేత.. ల్యాబ్ లో శానిటైజ్ చేస్తున్న జీవీఎంసీ సిబ్బంది. ప్రత్యామ్నాయంగా కేజీహెచ్ లోని నాకో ల్యాబ్ ను వినియోగిస్తున్న వైద్య సిబ్బంది.

కసబ్ చేతికున్న ఆ “ఎర్రదారం” కథ వింటే షాక్.. ఆ కుట్రలోనే భాగమట..!!

Story Behind Kasab Red Thread, కసబ్ చేతికున్న ఆ “ఎర్రదారం” కథ వింటే షాక్.. ఆ కుట్రలోనే భాగమట..!!

నవంబర్ 26.. ఈ తేదీ వింటే చాలు.. ముంబై మారణ హోమం గుర్తుకురాక మానదు. దేశచరిత్రలోనే అత్యంత భయానమైన ఉగ్రదాడి అది. దాదాపు పన్నెండేళ్ల క్రితం.. దేశ ఆర్థిక రాజధానిలో మారణహోమం సృష్టించి అనేక మంది ప్రాణాలను తీశారు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు. ముంబై తీరం వెంట ఎంటరైన 10 మంది ఉగ్రవాదులు.. విచక్షణారహితంగా చేసిన దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికిపైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులు.. మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు. కసబ్ పక్కా పాకీస్థానీ ముస్లిం. అతిచిన్న వయస్సులోనే ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. అయితే ఇతడు సజీవంగా పట్టుబడటం.. ఎన్నో నిజాలను తెలిసేలా చేసింది. పాక్ కుట్రలను విచారణలో తెలుసుకోగలిగారు మన అధికారులు. ముఖ్యంగా ముంబై ఘటనను హిందు ఉగ్రవాద చర్యగా చిత్రీకరించేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయట. ఇందుకు లష్కరే తోయిబా అనేక ప్రయత్నాలు చేసిందని తెలిసింది.

ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ రాకేశ్‌ మారియా.. ‘లెట్‌ మీ సే ఇట్‌ నౌ’ పేరిట రచించిన పుస్తకంలో ఈ వివరాలను పూర్తిగా వెల్లడించారు. ఈ పుస్తకాన్ని సోమవారం విడుదల చేశారు. ముంబై ఉగ్రదాడులపై తాను సాగించిన దర్యాప్తునకు సంబంధించి అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఉగ్రవాదుల పేర్లను మార్చి, భారతీయ చిరునామాలపై నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించారని తెలిపారు. ఈ ఉగ్ర దాడుల్లో కీలకంగా వ్యవహరించిన ఉగ్రవాది మొహమ్మద్‌ అజ్మల్‌ అమీర్‌ కసబ్‌ను బెంగళూరుకు చెందిన వాడిగా గుర్తింపు కార్డు సృష్టించారని. .ఇందులో కసబ్ పేరు సమీర్‌ ఛౌదరిగా పేర్కొన్నారని మారియా తన పుస్తకంలో వెల్లడించారు.
అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే అతడు సమీర్‌ చౌదరిగానే మరణిస్తే.. అప్పుడు కసబ్ చేతికి ఉన్న ఎర్రదారం ఆధారంగా.. ఈ దాడిని హిందూ ఉగ్రవాదంగా చిత్రీకరిస్తే.. అటు మీడియా కూడా దాన్ని హిందూ ఉగ్రవాద చర్యగా భావిస్తుందని లష్కరే తాయిబా కుట్ర పన్నినట్లు తెలిపారు. అందులో భాగంగానే కసబ్‌ చేతికి హిందువులు ధరించే ఎర్ర రంగు కంకణం కట్టారని పేర్కొన్నారు.

ఇలా చేస్తే.. ఈ ఘటనను హిందూ టెర్రర్‌గా నమ్మించే ప్రయత్నం చేయోచ్చని ప్లాన్ వేశారనన్నారు. హిందూ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని మీడియా సంస్థలు కూడా అదే పనిగా పెద్ద పెద్ద డిబేట్‌లు పెట్టేందుకు రెడీ అవుతాయని.. అంతా బెంగళూరు వైపు చూస్తారని లష్కరే తోయిబా ప్లాన్ వేసింది. అయితే కసబ్ సజీవంగా పట్టుబడటంతో.. లష్కరే తోయిబా కుట్రలు ఫెయిల్ అయ్యాయి. కసబ్‌ పాకిస్థాన్‌లోని ఫరీద్‌కోట్‌కు చెందినవాడిగా తేలిందని వివరించారు. అయితే కసబ్‌ సజీవంగా పట్టుబడడంతో.. పోలీసులకు తమకు సంబంధించిన వివారాలు చెప్తాడన్న కారణంతో.. జైల్లోనే కసబ్‌ను హతమార్చేందుకు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా ప్రయత్నాలు కూడా చేసినట్లు మారియా వెల్లడించారు. కసబ్‌ను హతమార్చే పనిని దావూద్‌ గ్యాంగ్‌కు అప్పగించినట్లు తెలిపారు.
కాగా.. కసబ్ దొంగతనాలు చేసేందుకు ఈ ఉగ్ర సంస్థలో చేరాడని.. తొలుత జీహాద్‌తో అతడికి సంబంధం లేదని తెలిపారు. అయితే భారత్‌లో ముస్లింలను నమాజ్‌ చేసుకునేందుకు కూడా అనుమతించరని అతడిని మైండ్ వాష్ చేసి నమ్మించారని.. మెట్రో సినిమా థియేటర్‌ సమీపంలోని మసీదులో కసబ్‌ను ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించినప్పుడు అతడు షాక్‌కు గురయ్యాడని మరియా తన పుస్తకంలో వెల్లడించారు. మొత్తానికి కసబ్ సజీవంగా పట్టుబడటం లష్కరే తొయిబాకు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

Related Tags