‘ఆపండి మీ నినాదాలు’, ఆగ్రహించిన నితీష్ కుమార్

బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య ప్రచారాలు ‘ఉప్పు, నిప్పు’లా సాగుతున్నాయి. తేజస్వి యాదవ్ ర్యాలీలకు జనం పోటెత్తుతున్న వీడియోలు వైరల్ అవుతుండగా.. నితీష్ కుమార్  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బుధవారం నితీష్ పాల్గొన్న ఓ ప్రచార సభకు హాజరైన జనం..’లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేయడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ‘మీరు ఏమంటున్నారు ? ఏమిటీ నాన్సెన్స్ ? ‘అని గట్టిగా కేక పెట్టారు. ఇక్కడ గందరగోళం […]

  • Umakanth Rao
  • Publish Date - 8:00 pm, Wed, 21 October 20

బీహార్ ఎన్నికల్లో సీఎం నితీష్ కుమార్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మధ్య ప్రచారాలు ‘ఉప్పు, నిప్పు’లా సాగుతున్నాయి. తేజస్వి యాదవ్ ర్యాలీలకు జనం పోటెత్తుతున్న వీడియోలు వైరల్ అవుతుండగా.. నితీష్ కుమార్  ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బుధవారం నితీష్ పాల్గొన్న ఓ ప్రచార సభకు హాజరైన జనం..’లాలూ యాదవ్ జిందాబాద్’ అని నినాదాలు చేయడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ‘మీరు ఏమంటున్నారు ? ఏమిటీ నాన్సెన్స్ ? ‘అని గట్టిగా కేక పెట్టారు. ఇక్కడ గందరగోళం చేయకండి..నాకు ఓటు చేయకపోతే ఫరవాలేదు..అల్లరి చేయడానికే మీరిక్కడికి వచ్చారా  అని నితీష్ అన్నారు. ఈ నెల 28 న బీహార్ తొలిదశ ఎన్నికలు జరగనున్నాయి.