మానవ జన్యు మార్పిడిని నిషేధించాలంటూ శాస్త్రవేత్తలు డిమాండ్

యు.ఎస్, కెనడా, జర్మనీ కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు జన్యు మార్పిడిని ప్రపంచవ్యాప్తంగా నిషేదించాలని కోరారు. హెచ్ఐవి నిరోధన కోసం ఇటీవల చైనా శాస్త్రవేత్త ఒకరు కవల పిల్లల పిండాలను సంకలనం చేయడంలో విఫలం అయ్యారు. ఇది కాస్తా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది. దీనితో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. పరిశోధకులు మానవుల డిఎన్ఎలతో జన్యు మార్పిడిని చేయడాన్ని నిషేధించాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే ‘మానవ జాతిని పునఃనిర్మించడానికి అత్యంత […]

మానవ జన్యు మార్పిడిని నిషేధించాలంటూ శాస్త్రవేత్తలు డిమాండ్
Follow us

|

Updated on: Mar 14, 2019 | 4:49 PM

యు.ఎస్, కెనడా, జర్మనీ కు చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు జన్యు మార్పిడిని ప్రపంచవ్యాప్తంగా నిషేదించాలని కోరారు. హెచ్ఐవి నిరోధన కోసం ఇటీవల చైనా శాస్త్రవేత్త ఒకరు కవల పిల్లల పిండాలను సంకలనం చేయడంలో విఫలం అయ్యారు. ఇది కాస్తా ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయ్యింది. దీనితో శాస్త్రవేత్తలు అందరూ కూడా ఈ ప్రక్రియను ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలని డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.

పరిశోధకులు మానవుల డిఎన్ఎలతో జన్యు మార్పిడిని చేయడాన్ని నిషేధించాలని కోరుకుంటున్నారు, ఎందుకంటే ‘మానవ జాతిని పునఃనిర్మించడానికి అత్యంత సాహసోపేత ప్రణాళికలను’ నెమ్మదిగా చేయవలసిన అవసరం ఉందని.. అంతేగానీ ఇలా తొందర పడితే ప్రమాదాలు వస్తాయని వారు భావిస్తున్నారు.

అయితే ఈ విషయానికి కొంతమంది శాస్త్రవేత్తలు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు అయితే బ్యాన్ చేయడం అనవసరం అని.. అలా చేయడం వల్ల ముఖ్యమైన పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొంటున్నారు.

మరోవైపు యు.ఎస్, కెనడా, జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం దీని మీద కొద్దికాలం బ్యాన్ చేస్తే బాగుంటుందని రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

వారి మాటల్లోనే..

స్పెర్మ్స్, గుడ్లు లేదా పిండాలలో డిఎన్ఎను ఎలా మార్చాలో- అది జన్యు మార్పిడిలో ఎలా ఉపయోగించాలి.. మరియు వాటిని ఎలా నియంత్రించాలి అనే దానిపై అంతర్జాతీయ ప్రమాణాలు రూపొందించాలి.

ప్రయోగశాలల్లో గానీ పరిశోధనా కేంద్రాల్లో గానీ డిఎన్ఎను సంకలనం చేయడం ఇప్పటికీ అనుమతిస్తున్నారు. అంతేకాదు ప్రతీ దేశం.. వారి శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కూడా పరిశీలించవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా జెనెటిక్స్ ను సంకలనం చేయడంలో చాలా కొత్తరకం పద్ధతులు వచ్చాయి. ఎన్ని వచ్చినా కూడా జన్యు మార్పిడి చేయడం ఇప్పటికీ సురక్షితం కాదు. దాని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

‘క్లినికల్ జెర్మ్లైన్ సంకలనం’ చేసేటప్పుడు ఆ ప్రక్రియ విఫలం అయితే అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయని.. అందువల్ల ఇలాంటి ప్రక్రియలు చాలా జాగ్రత్తగా చేయాలంటూ ప్రపంచ శాస్త్రవేత్తల మండలిలో ఇప్పటికే అగ్రిమెంట్ జరిగింది.

జన్యు మార్పిడి వల్ల మనం డిఎన్ఎ ను కంట్రోల్ లోకి తెచ్చుకుని మనకు కావాల్సిన విధంగా శరీరం రంగును, కంటి రంగును మార్చుకోవచ్చు. కానీ ఇది తేడా అయితే మాత్రం అతి తెలివి..లేదా అతి క్రూరమైన వాళ్ళు రూపొందుతారని వారి భావన.

గతేడాది నవంబర్ లో చైనీస్ శాస్త్రవేత్త హి. జైన్ కుయి జన్యు మార్పిడి ద్వారా జిఎమ్ డిజైన్డ్ బేబీలను తయారు చేశారు.. అంతేకాదు ఎచ్ఐవి రాకుండా వారి డిఎన్ఎ ను సంకలనం కూడా చేశాడు. ఆయన ప్రకటించిన కొన్ని రోజులకే ఈ ప్రకటన చైనాలో సంచలనం అయింది. ఎందుకంటే అప్పటికే చైనాలో ఈ ప్రక్రియను బ్యాన్ చేయగా ఆయన దీనికి విరుద్ధంగా కనుగొన్నారు.

ఇది ఇలా ఉంటే కొద్దీ రోజుల తర్వాత ఆ చిన్నారులు ఇద్దరూ కూడా వైరస్ సోకి మృతి చెందారు. దీనిపై ఆగ్రహం చెందిన చైనా ప్రభుత్వం ఆ శాస్త్రవేత్తకు కఠిన చర్యలు అమలు చేశారు. అంతేకాదు యూనివర్సిటీ వాళ్ళు ఆయనను బయటి పంపించారు.

దీనితో అప్పటి నుంచి చాలా మంది శాస్త్రవేత్తలు జన్యు మార్పిడి మీద బ్యాన్ విధించాలని కోరుతున్నారు.

అసలు జీన్స్ అంటే ఏంటి..?

మనుషుల్ని తెలివైనవాళ్లు చేసేవి జీన్స్. స్వతహాగా తెలివి కలిగించే జీన్స్ ఉండచ్చు. అలాగే బ్రెయిన్‌ని బూస్ట్ చేయడానికి జీన్ మ్యానిప్యులేషన్ చేయచ్చు. పరిశోధకుల ప్రకారం తెలివి ఎక్కువగా చదవడం వలన వస్తుంది. 75 శాతం ఐక్యు వంశపారంపర్యంగా వస్తుంది. మిగిలినదానికి పరిస్థితులు కారణం అవుతాయి. అయితే ఇప్పటి వరకు ఏ జీన్స్ తెలివిని కలిగిస్తున్నాయో మాత్రం చెప్పలేకపోయారు. అది కనుక తెలిసిపోతే అందరినీ తెలివైనవారుగా మార్చేయచ్చు. తెలివినిచ్చే ఒక్క జీన్‌ని కనిపెట్టలేకపోతున్నారు కాని మనిషి తెలివికి జతకలిసిన జీన్ సముదాయాన్ని మార్చేయచ్చు అంటున్నారు. ఇంకా ఆవైపు అడుగులు పడలేదు. ప్రస్తుతం సిద్ధాంతపరంగానే ఉంది.

అంతేకాదు ఈ జీన్స్ వల్ల వయసు పెరుగుదల, వృద్దాప్యం రాకుండా కూడా నిరోధించవచ్చు అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇలా చేస్తే మానవ జాతికి పెను ప్రమాదం ఎదురవుతుందని.. వీటిని నిషేదిస్తేనే మంచిదని వారు అంటున్నారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు