ఎలుగుపై రాళ్ల దాడి.. నీళ్లలో పడ్డ భళ్లూకం.. వీడియో వైరల్

జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో అమానుష చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. గ్రామస్తుల నుంచి తప్పించుకొని దగ్గర్లోని ఓ కొండను ఎక్కుతోన్న ఎలుగుబంటిపై వారు రాళ్లు విసిరారు. దీంతో పట్టుకోల్పోయిన ఆ భళ్లూకం నదిలో పడిపోయింది. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. ఓ మూగజీవిపై ఇలాంటి చర్యలు అమానుషం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బషీర్ […]

ఎలుగుపై రాళ్ల దాడి.. నీళ్లలో పడ్డ భళ్లూకం.. వీడియో వైరల్
Follow us

| Edited By:

Updated on: May 11, 2019 | 5:45 PM

జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో అమానుష చర్యకు పాల్పడ్డారు కొందరు దుండగులు. గ్రామస్తుల నుంచి తప్పించుకొని దగ్గర్లోని ఓ కొండను ఎక్కుతోన్న ఎలుగుబంటిపై వారు రాళ్లు విసిరారు. దీంతో పట్టుకోల్పోయిన ఆ భళ్లూకం నదిలో పడిపోయింది. ఆ తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. ఓ మూగజీవిపై ఇలాంటి చర్యలు అమానుషం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు దీనిపై స్పందించిన సీనియర్ పోలీస్ ఆఫీసర్ బషీర్ హుల్‌హక్ చౌదరీ.. ఎలుగు ఆచూకీ కోసం రాష్ట్ర అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారని.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.