స్టాక్‌మార్కెట్లు కుదేలు

ముంబయి: దేశీయ మార్కెట్లను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆటోమొబైల్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో వరుసగా ఎనిమిదో రోజు సూచీల పతనం కొనసాగింది. నేటి మార్కెట్‌ ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ను కోల్పోయింది. ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 190 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌ ఆ తర్వాత […]

స్టాక్‌మార్కెట్లు కుదేలు
Follow us

|

Updated on: Feb 18, 2019 | 4:31 PM

ముంబయి: దేశీయ మార్కెట్లను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆటోమొబైల్‌, ఫార్మా, ఐటీ, ఆర్థిక రంగాల షేర్లు కుదేలవడంతో పాటు విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో వరుసగా ఎనిమిదో రోజు సూచీల పతనం కొనసాగింది. నేటి మార్కెట్‌ ఆద్యంతం ఒత్తిడికి గురైన సూచీలు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు పతనంకాగా.. నిఫ్టీ 10,700 మార్క్‌ను కోల్పోయింది.

ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్లు.. కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో 190 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్‌ ఆ తర్వాత మరింత దిగజారింది. అమ్మకాల ఒత్తిడితో ఏ దశలోనూ కోలుకోలేని సెన్సెక్స్‌ చివరకు 310 పాయింట్ల నష్టంతో 35,498 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. అటు నిఫ్టీ 83 పాయింట్లు కోల్పోయి 10,641 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 71.38గా కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఓఎన్జీసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, టాటామోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్ షేర్లు స్వల్పంగా లాభపడగా.. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.