కశ్మీరీ ఎఫెక్ట్‌ను అధిగమించిన స్టాక్ మార్కెట్లు..

Stock Market : Sensex trades 100 pts higher.. Nifty near 10950, కశ్మీరీ ఎఫెక్ట్‌ను అధిగమించిన స్టాక్ మార్కెట్లు..

కశ్మీర్ ఎఫెక్ట్‌తో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మంగళవారం మాత్రం లాభాల బాటపట్టాయి. ఉదయం 10.01గంటలకు సెన్సెక్స్‌ 141 పాయింట్లు ఎగబాకి 36,840.98 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 44.65 పాయింట్ల లాభంతో 10,907.25 వద్ద కొనసాగుతోంది. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 70.67వద్ద కొనసాగుతోంది.

టెక్‌ మహీంద్రా, ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, బర్జర్‌ పెయింట్స్, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుందడగా.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, టైటాన్‌, హెచ్‌యూఎల్‌, ఆర్‌ఐఎల్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *