బ్రేకింగ్ న్యూస్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ నిలిపివేత

శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ రోజు స్టాక్ మార్కెట్లు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోయర్ సర్క్సూట్‌ను తాకాయి. సూచికలు 10 శాతం పతనం కాగానే.. ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు..

బ్రేకింగ్ న్యూస్: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ నిలిపివేత
Follow us

| Edited By:

Updated on: Mar 13, 2020 | 12:14 PM

శుక్రవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ రోజు ఉదయం స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. సూచికలు 10 శాతం పతనం కాగానే.. ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు సెబీ వర్గాలు తెలిపాయి. సరిగ్గా 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ సూచిక 29,687.52 పాయింట్ల వద్ద ఉన్న సమయంలో ట్రేడింగ్‌ను నిలుపుదల చేశారు. ఎన్‌ఎస్ఈ సూచిక 10.7 శాతం పడిపోయి 8,624 పాయింట్ల వద్ద ఉంది. మార్కెట్ వ్యాప్తంగా ఉన్న సర్క్యూట్ బ్రేకర్లు బీఎస్‌ఇ సెన్సెక్స్, నిఫ్టి 50 కదలికలను నియంత్రిస్తాయి. కాగా కరోనా వైరస్ కారణంగా గత కొద్ది రోజుల నుంచీ సెన్సెక్స్ నష్టలను చవిచూస్తూనే ఉన్నాయి. కాగా.. మరలా 10 గంటల 5 నిమిషాలకు తిరిగి ట్రేడింగ్ ప్రారంభమయ్యింది. 10 గంటల 20 నిమిషాలకు సాధారణ ట్రేడింగ్ నెలకొంది. కాగా.. భారత స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ను  నిలిపివేయడం 12 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు