Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

ఇండియాలో అత్యాచారాలు .. షాకింగ్ డీటెయిల్స్ !

Indian police shot dead four men, ఇండియాలో అత్యాచారాలు .. షాకింగ్ డీటెయిల్స్ !

హైదరాబాద్ లో దిశపై హత్యాచారం కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం దేశవ్యాప్త సంచలనం సృష్టించింది. పోలీసుల చర్యపట్ల దిశ కుటుంబంతో బాటు అనేకమంది సెలబ్రిటీలతో సహా హర్షం ప్రకటిస్తున్నారు. అయితే ఇండియాలో ఇలాంటి కేసుల వివరాల్లోకి ఒక్కసారి వెళ్తే..
ఇటీవలి ప్రభుత్వ డేటా ప్రకారం.. ఈ దేశంలో 2017 లో 32, 500 కు పైగా రేప్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయ్యాయి. రోజుకు ఇవి సుమారు 90 కేసులవరకు ఉన్నట్టు వెల్లడయింది. ఆ ఏడాదిలో దేశంలోని కోర్టులు వీటిలో కేవలం 18, 300 కేసులను మాత్రమే పరిష్కరించాయని, ఆ సంవత్సరాంతానికి ఇంకా వేలాది కేసులు పెండింగులో పడిపోయాయని తెలిసింది. మహిళలు, యువతులపై అత్యాచారాలు, హింస అంతర్జాతీయంగా ఇండియా ప్రతిష్టను దిగజార్చాయి. ఇక ప్రధానంగా కొన్ని కేసుల విషయానికి వస్తే..
1973 : నవంబరు : ముంబైలోని ఓ ఆసుపత్రిలో నైట్ షిఫ్ట్ లో ఉన్న అరుణా షాన్ బాగ్ అనే నర్సుపై వార్డు అటెండెంట్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె గొంతు నులిమి… కుక్కలను కట్టేసే గొలుసుతో ఆమెను మంచానికి కట్టేశాడు. పైగా ఆమె తలకు ఆక్సిజన్ సప్లై చేసే ట్యూబ్ ను కట్ చేయడంతో ఆమె కోమాలోకి వెళ్ళింది. దాదాపు 40 సంవత్సరాల పాటు కోమాలోనే ఉండి చివరకు 2015 లో మరణించింది.
1990: కోల్ కతాలో 14 ఏళ్ళ హీతల్ ఫరేఖ్ అనే విద్యార్థినిపై ధనుంజయ్ ఛటర్జీ అనే వ్యక్తి రేప్ చేసి హత్య చేశాడు. 2004 లో అతనికి ఉరిశిక్షవిధించారు. (13 ఏళ్లలో ఇండియాలో ఒక వ్యక్తికి ఉరి శిక్షను అమలు చేయడం అదే మొదటిసారి).
1992: రాజస్థాన్ లో భన్వరీ దేవి అనే మహిళను అయిదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేశారు. అయితే 1995 లో జైపూర్ కోర్టు వారిని నిర్దోషులుగా విడిచిపుచ్చింది.
1996 : ఢిల్లీలో ప్రియదర్శిని మాటో అనే లా విద్యార్థినిపై ఆమె సహ విద్యార్థి అయిన సంతోష్ కుమార్ సింగ్ అత్యాచారం చేసి గొంతు నులిమి చంపాడు. అతనికి మరణశిక్ష పడినా తగినన్ని సాక్ష్యాధారాలు లేవన్న కారణంపై అతడిని కోర్టు వదిలివేసింది.
2012 డిసెంబరు : ఢిల్లీలో ప్రయాణిస్తున్న బస్సులో 23 ఏళ్ళ విద్యార్థినిపై ఓ బాల నేరస్తుడితో బాటు అయిదుగురు అత్యాచారం చేశారు. ఇదే నిర్భయ కేసుగా దేశంలో అలజడి సృష్టించింది.
2018 : జనవరి : యూపీలో 8 ఏళ్ళ ముస్లిం బాలికపై గుడిలో అత్యాచారం జరిగింది. వారం రోజులపాటు ఓ పూజారితో సహా ముగ్గురు పోలీసులు ఆమెకు నరకం చూపి మర్డర్ చేశారు.
2018 జులై : చెన్నైలో 12 ఏళ్ళ బాలికపై ఏడు నెలల కాలంలో పద్దెనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డారు.
2018 అక్టోబర్ : కేరళలో ఓ కేథలిక్ బిషప్ తనను రెండేళ్ల పాటు రేప్ చేశాడంటూ ఓ నన్ కేసు పెట్టింది. అయితే ఆ బిషప్ ఆ తరువాత విడుదలయ్యాడు.
2019 జులై : యూపీలో కుల్ దీప్ సెంగార్ అనే ఎమ్మెల్యే 2017 లో ఓ విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ సంవత్సరం ఆమె ప్రయాణిస్తున్న కారును అతగాడు యాక్సిడెంట్ చేయడంతో ఆ ప్రమాదంలో ఆమె, ఆమె తరఫు లాయర్ తీవ్రంగా గాయపడ్డారు.
2019 నవంబరు 28: హైదరాబాద్ లోని శంషాబాద్ లో దిశ అనే యువతిపై హత్యాచారం చేసిన నలుగురు మృగాళ్లు.. (అయితే వీరిని పోలీసులు డిసెంబరు 6 న ఎన్ కౌంటర్ చేశారు).
2019 డిసెంబరు 5 : యూపీలోని ఉన్నావ్ లో ఓ రేప్ బాధితురాలు కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆమె శరీరంపై ముగ్గురు కిరోసిన్ పోసి నిప్పంటించారు.