చిరుతలా పరుగెత్తి.. స్వర్ణాన్ని దక్కించుకున్న హిమదాస్

భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పోలాండ్‌లో జరుగుతున్న పోజన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి పోటీల్లో భాగంగా నిర్వహించిన 200 మీటర్ల పరుగును 23.65 సెకన్లలో ముగించి ఆమె ఈ ఘనత సాధించింది. గతంలో 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును హిమదాస్ సాధించింది. అయితే గత కొంతకాలంగా హిమదాస్ వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి నుంచి కోలుకున్న తర్వాత హిమ.. చిరుత వేగంతో పరుగెత్తి ఈ పతకాన్ని తన ఖాతాలో […]

చిరుతలా పరుగెత్తి.. స్వర్ణాన్ని దక్కించుకున్న హిమదాస్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 05, 2019 | 7:25 AM

భారత స్టార్ అథ్లెట్ హిమదాస్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. పోలాండ్‌లో జరుగుతున్న పోజన్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రి పోటీల్లో భాగంగా నిర్వహించిన 200 మీటర్ల పరుగును 23.65 సెకన్లలో ముగించి ఆమె ఈ ఘనత సాధించింది. గతంలో 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డును హిమదాస్ సాధించింది. అయితే గత కొంతకాలంగా హిమదాస్ వెన్నునొప్పితో బాధపడుతోంది. ఆ నొప్పి నుంచి కోలుకున్న తర్వాత హిమ.. చిరుత వేగంతో పరుగెత్తి ఈ పతకాన్ని తన ఖాతాలో వేసుకొంది.