శేష్‌కు లేడి లక్ ఆమెనా..?

యంగ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు వెంకట్ రాంజీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎవరు’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రెజీనా కసెండ్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అడివి శేష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్‌ను రేపు సాయంత్రం 5.30 గంటలకు స్టార్ హీరోయిన్ సమంతా చేతుల మీదగా రిలీజ్ చేయనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ మూవీని పివిపి సినిమా బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రం ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *