నేను షూటింగ్‌లకి రాను.. నా కూతురిని కూడా పంపను: శక్తి కపూర్

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. దీంతో గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్న నటీనటులు షూటింగ్‌లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అయితే వీరిలో కొంతమంది షూటింగ్‌లకు రెడీగా లేనట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్‌ తీసుకోకపోవడమే మంచిదన్న ఆలోచనలో కొంతమంది నటీనటులు ఉన్నట్లు టాక్. టాలీవుడ్‌లో మహేష్ బాబు, నాని ఇప్పటికే ఈ నిర్ణయాన్ని తమ దర్శకనిర్మాతలకు ప్రకటించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రముఖ […]

నేను షూటింగ్‌లకి రాను.. నా కూతురిని కూడా పంపను: శక్తి కపూర్
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 9:40 AM

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగ్‌లకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి. దీంతో గత మూడు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్న నటీనటులు షూటింగ్‌లకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. అయితే వీరిలో కొంతమంది షూటింగ్‌లకు రెడీగా లేనట్లు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రిస్క్‌ తీసుకోకపోవడమే మంచిదన్న ఆలోచనలో కొంతమంది నటీనటులు ఉన్నట్లు టాక్. టాలీవుడ్‌లో మహేష్ బాబు, నాని ఇప్పటికే ఈ నిర్ణయాన్ని తమ దర్శకనిర్మాతలకు ప్రకటించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ తాను ఇప్పట్లో షూటింగ్‌కు వెళ్లనని ఖరాఖండిగా చెప్పేశారు. అంతేకాదు తన కుమార్తె, ప్రముఖ నటి శ్రద్దా కపూర్‌ని సైతం షూటింగ్‌లకు పంపనని ఆయన స్పష్టం చేశారు.

”నేను షూటింగ్‌లకు వెళ్లేందుకు రెడీగా లేను. నా కుమార్తెను కూడా పంపను. ఇప్పట్లో కరోనా పోతుందని నేను నమ్మడం లేదు. త్వరలోనే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయని అనుకుంటున్నా. నా పిల్లలను కూడా నేను బయటకు పంపలేను. బతికేందుకు పని అవసరమని నాకు తెలుసు. కానీ అది మన ప్రాణాలకంటే ముఖ్యం కాదు. ఫిల్మ్‌ మేకర్లు షూటింగ్ ప్రారంభిస్తామని చెబుతుంటే భయంగా ఉంది. ఆసుపత్రికి బిల్లులు కట్టడం కంటే కొన్ని రోజులు ఎదురుచూడటమే మంచిదని నేను ఇండస్ట్రీలోని కొంతమందికి చెప్పాను. బయట పరిస్థితులు అస్సలు బాలేవు” అని శక్తి అన్నారు.

అంతేకాకుండా ”ఆసుపత్రుల్లో బెడ్‌ల కొరత గురించి మనం వింటూనే ఉన్నాం. చికిత్స కోసం కూడా చాలా డబ్బులను చార్జ్ చేస్తున్నారు. బిల్లు కట్టనందుకు ఓ వ్యక్తిని ఆసుపత్రిలో కట్టేసిన వార్త చూశాము. దీనిపై నేను ఓ వీడియో చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఓ బాధాకరమైన స్థలంగా మారింది. ఇక్కడ ఎలాంటి మానవత్వం లేదు” అని శక్తి కపూర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Read This Story Also: ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటాన్ని సహించలేకనే: జేసీ అరెస్ట్‌పై బాబు ఫైర్

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు