బన్నీతో స్పెషల్ సాంగ్.. ఎవరా “లక్కీ గాళ్”

Kajal Special Song With Allu Arjun, బన్నీతో స్పెషల్ సాంగ్.. ఎవరా “లక్కీ గాళ్”

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా అల వైకుంఠపురంలో హీరోయిన్ కాజల్ స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుశాంత్, టబు, నవదీప్, జయరామ్, నివేదా పేతురాజ్‌కు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్‌తో స్పెషల్ సాంగ్ లో నటించిన కాజల్, ఇప్పుడు ఈ చిత్రంలో బన్నీతో కలిసి స్టెప్పులు వేయడానికి రెడీ అవుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఇప్పటికి ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. గతంలో ఆర్య 2 సినిమాలో బన్నీ సరసన కాజల్ హీరోయిన్‌గా నటించి మంచి హిట్ అందుకున్నారు. అలాగే రామ్ చరణ్ ఎవడు సినిమాలో కూడా వీరిద్దరూ ఒక స్పెషల్ సీన్‌లో నటించి ప్రేక్షకులను అలరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *