ఫేమస్ కమెడియన్‌‌‌ను చంపేస్తామంటున్న యశ్ ఫ్యాన్స్..ఎందుకంటే..?

కేజిఎఫ్ చిత్రంతో హీరో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అంతకంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయినప్పటికి..కేజీఎఫ్ మాత్రం అతనికి నేషనల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో యశ్‌కి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే ఆ ఫ్యానిజం ఇప్పుడు ఓ యువ కమెడియన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. యశ్‌ అభిమానులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ  ఆరోపించారు కమెడియన్‌ సుదర్శన్‌ రంగప్రసాద్‌. రెండు సంవత్సరాల క్రితం ఓ కామెడీ షోలో రంగప్రసాద్‌.. యశ్‌ సినిమాలోని ఓ డైలాగ్‌ను […]

ఫేమస్ కమెడియన్‌‌‌ను చంపేస్తామంటున్న యశ్ ఫ్యాన్స్..ఎందుకంటే..?
Follow us

|

Updated on: Oct 22, 2019 | 7:07 PM

కేజిఎఫ్ చిత్రంతో హీరో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. అంతకంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయినప్పటికి..కేజీఎఫ్ మాత్రం అతనికి నేషనల్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. దీంతో యశ్‌కి ఫ్యాన్ బేస్ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. అయితే ఆ ఫ్యానిజం ఇప్పుడు ఓ యువ కమెడియన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది.

యశ్‌ అభిమానులు తనను చంపేస్తానని బెదిరిస్తున్నారంటూ  ఆరోపించారు కమెడియన్‌ సుదర్శన్‌ రంగప్రసాద్‌. రెండు సంవత్సరాల క్రితం ఓ కామెడీ షోలో రంగప్రసాద్‌.. యశ్‌ సినిమాలోని ఓ డైలాగ్‌ను మిమిక్రీ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన యశ్‌ అభిమానులు రంగప్రసాద్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు ఆయన బెంగళూరులోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియా వేదికగా తనను వేధించవద్దని యశ్‌ అభిమానులను కోరారు.

‘నేను యశ్‌తో కలిసి పనిచేశాను. యశ్‌ అంటే నాకు అభిమానం ఉంది. నేను చేసిన మిమిక్రీని కొందరు తప్పుగా అర్థం చేసుకుని నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. నేను వారికి ఒకటే చెబుతున్నాను. జోక్‌ను జోక్‌లాగానే చూడండి సీరియస్‌గా తీసుకోకండి. నేను వేరే వాళ్లని బాధపెట్టడానికో, లేక చులకన చేయడానికో ఆ డైలాగ్‌ చెప్పలేదు. నాకు తెలిసినంత వరకూ యశ్‌ కూడా ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడడు. ఆ వీడియో చూసి నన్ను చంపేస్తానంటూ కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారు.’ అని రంగప్రసాద్‌ తెలిపారు.

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం