కేసీఆర్‌కు స్టాలిన్‌ షాక్ ఇస్తారా..!

డీఎంకే నేత స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 13న స్టాలిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. అయితే ఆ రోజున ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండడంతో ఈ నెల 12నే కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి అవకాశమే లేదని తమిళ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై సస్పెన్స్ వీడటం లేదు.

కాగా దేశంలో మోదీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగా నిదానంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేరళ సీఎం పినరయిని కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించిన కేసీఆర్.. స్టాలిన్‌తో భేటీ అవ్వాలని భావించారు. అయితే మహాకూటమికి మద్దతిస్తోన్న స్టాలిన్.. కేసీఆర్‌తో కలిసేందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు స్టాలిన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. తన ఫ్రంట్ వ్యూహంలో భాగంగా లోగడ చెన్నై వెళ్లిన కేసీఆర్‌కు డీఎంకే వర్గాలు రెడ్ కార్పెట్ పరిచిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో స్టాలిన్ ‌కూడా ఈ ప్రతిపాదనపై ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కేసీఆర్‌తో సమావేశం అవుతారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. తమిళ మీడియా వార్తలకు ప్రాతిపదిక ఏమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *