కేసీఆర్‌కు స్టాలిన్‌ షాక్ ఇస్తారా..!

డీఎంకే నేత స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 13న స్టాలిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. అయితే ఆ రోజున ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండడంతో ఈ నెల 12నే కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి అవకాశమే లేదని తమిళ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై సస్పెన్స్ వీడటం లేదు. కాగా దేశంలో మోదీ, రాహుల్ గాంధీలకు […]

కేసీఆర్‌కు స్టాలిన్‌ షాక్ ఇస్తారా..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2019 | 4:33 PM

డీఎంకే నేత స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నెల 13న స్టాలిన్‌తో ఆయన భేటీ అవుతారని తెలంగాణ సీఎంవో ప్రకటించింది. అయితే ఆ రోజున ఉప ఎన్నికల ప్రచారంలో స్టాలిన్ బిజీగా ఉండడంతో ఈ నెల 12నే కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వీరిద్దరి భేటీకి అవకాశమే లేదని తమిళ మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో వీరి సమావేశంపై సస్పెన్స్ వీడటం లేదు.

కాగా దేశంలో మోదీ, రాహుల్ గాంధీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఉండాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగా నిదానంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేరళ సీఎం పినరయిని కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించిన కేసీఆర్.. స్టాలిన్‌తో భేటీ అవ్వాలని భావించారు. అయితే మహాకూటమికి మద్దతిస్తోన్న స్టాలిన్.. కేసీఆర్‌తో కలిసేందుకు సముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌కు స్టాలిన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సమాచారం. తన ఫ్రంట్ వ్యూహంలో భాగంగా లోగడ చెన్నై వెళ్లిన కేసీఆర్‌కు డీఎంకే వర్గాలు రెడ్ కార్పెట్ పరిచిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో స్టాలిన్ ‌కూడా ఈ ప్రతిపాదనపై ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కేసీఆర్‌తో సమావేశం అవుతారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. తమిళ మీడియా వార్తలకు ప్రాతిపదిక ఏమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు విడుదల
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
టీమిండియా రికార్డ్‌కే ఎసరుపెట్టేసిన చెన్నై సూపర్ కింగ్స్
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
పుచ్చకాయ vs కర్జూజా.. వేసవిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
రామాయణంలో చిన్నప్పటి సీత పాత్రలో నటిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
క్వీన్ ఆఫ్ మాస్ గా టాలీవుడ్ చందమామ. దిమ్మతిరిగెలా చేస్తున్న కాజల్
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
తక్కువ ధరకే సీజ్ చేసిన బంగారం.. తీరా చూస్తే షాక్..!
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
శూర్ఫణఖతో కళ్యాణం చేయలేను .. అనామికకు ఇచ్చిపడేసిన ఇందిరా దేవి..
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
'జుచిని'తో ఇన్ని ప్రయోజనాలా? అవేంటో తెలిస్తే మైండ్‌ బ్లాంకే
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్.. డైరెక్ట్ లింక్ ఇదే