నడిగర్ సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం!

తమిళ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. పరిశ్రమకు సంబంధించిన 61 మంది వ్యక్తుల సభ్యత్వం రద్దుకు సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో తీర్పు వెలువడే వరకు ఎన్నికలను నిలిపివేయాలంటూ తమిళనాడులో ఓ అధికారి మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం నాడు హైకోర్టు పిటిషన్ పై విచారణ జరపగా.. అనుకున్న ప్రకారం ఇవాళ ఎన్నికలు జరిగేలా తీర్పును వెల్లడించింది. దీంతో విశాల్ […]

నడిగర్ సంఘం ఎన్నికలకు రంగం సిద్ధం!
Follow us

|

Updated on: Jun 23, 2019 | 7:35 AM

తమిళ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే నడిగర్ సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. పరిశ్రమకు సంబంధించిన 61 మంది వ్యక్తుల సభ్యత్వం రద్దుకు సంబంధించిన కేసు కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో తీర్పు వెలువడే వరకు ఎన్నికలను నిలిపివేయాలంటూ తమిళనాడులో ఓ అధికారి మద్రాస్ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

అయితే శుక్రవారం నాడు హైకోర్టు పిటిషన్ పై విచారణ జరపగా.. అనుకున్న ప్రకారం ఇవాళ ఎన్నికలు జరిగేలా తీర్పును వెల్లడించింది. దీంతో విశాల్ గ్రూప్‌కి భాగ్యరాజ్ గ్రూప్‌కి మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ఎంజీఆర్ జానకి కాలేజీలో ఈ ఎన్నికలు జరగనుండగా.. 3,161 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అటు కోర్టు ఇచ్చిన తీర్పుపై విశాల్ వర్గం హర్షం వ్యక్తం చేసింది. కాగా ‘దర్బార్’ షూటింగ్ కారణంగా తన ఓటు హక్కును వినియోగించుకోలేనని సూపర్‌స్టార్ రజినీకాంత్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.