వివాదంలో సేతుపతి

చెన్నై: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.  త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ మూవీకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించినందుకు నటీ, నటులకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. […]

వివాదంలో సేతుపతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2019 | 3:12 PM

చెన్నై: తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని పలు హిజ్రా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఆయన ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సూపర్‌ డీలక్స్‌’. సమంత, రమ్యకృష్ణ, ఫాహద్‌ ఫాజిల్‌ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది.  త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వం వహించిన ఈ మూవీకి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించినందుకు నటీ, నటులకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.

అయితే ఈ మూవీలో విజయ్ సేతుపతి అదిరిపోయే అభినయంతో ఆకట్టుకున్నా కూడా అతనిని వివాదాలు చుట్టుముట్టాయి. విజయ్‌ హిజ్రా (శిల్పా) పాత్రలో కనిపించారు. డబ్బుల కోసం పిల్లల్ని అపహరించి, మరొకరికి అమ్మేస్తారు. అయితే ఈ సన్నివేశం పట్ల పలు హిజ్రా సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తమను ‘సూపర్‌ డీలక్స్‌’లో తప్పుగా చూపించారని, కించపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిజ్రాలు ఎప్పుడూ అలా కిడ్నాప్‌ చేయరని, పిల్లలకు ఎప్పుడు హాని కల్గించరని…తమను తప్పు చేసేవారిగా చూపించి మనోభావాలతో ఆడుకున్నారని వారు ఆరోపించారు.  విజయ్‌ సేతుపతిని అరెస్టు చేయాలని కొందరు  హిజ్రాలు డిమాండ్‌ చేశారు.