సెప్టెంబ‌రు 29న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ! 

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబ‌రు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 30న సాయంత్రం 5.23 నుంచి 6 గంటల మధ్య మీనా లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటల నుంచి వాహనసేవలు ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమంలోని […]

సెప్టెంబ‌రు 29న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ! 
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 5:41 PM

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సెప్టెంబ‌రు 29వ తేదీ ఆదివారం రాత్రి 7.00 నుండి 8.00 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది. సెప్టెంబరు 30 నుంచి అక్టోబ‌రు 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 30న సాయంత్రం 5.23 నుంచి 6 గంటల మధ్య మీనా లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ధ్వజారోహణం అనంతరం శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేరోజు రాత్రి 8 గంటల నుంచి వాహనసేవలు ప్రారంభం కానున్నాయి.

వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్స‌వం నిర్వ‌హించే ముందు అది విజ‌య‌వంతం కావాల‌ని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్ప‌ణం నిర్వ‌హిస్తారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షిస్తారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటుతారు. నవధాన్యాలకు మొలకలొచ్చేవరకు నీరు పోస్తారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణం అయింది. అంకురార్పణ ఘట్టం తరువాత రంగనాయకుల మండపంలో ఆస్థానం నిర్వహిస్తారు. అంకురార్పణం అంటే విత్తనం మొలకెత్తడం. శాస్త్రాల ప్రకారం ఉత్సవానికి తొమ్మిది రోజుల ముందు అంకురార్పణం నిర్వహిస్తారు.

శాస్త్రాల ప్రకారం ఏదైనా ఉత్సవానికి 9, 7, 5, 3 రోజులు లేదా ఒక రోజు ముందు అంకురార్పణం నిర్వహించడం ఆనవాయితీ. ఖగోళశాస్త్రంలోని సిద్ధాంతాల ప్రకారమే ఇలా చేస్తారు. మొక్కలకు అధిదేవత చంద్రుడు కాబట్టి రాత్రి సమయంలోనే విత్తనం నాటుతారు. ఆగమాల ప్రకారం విత్తనం బాగా మొలకెత్తడాన్ని ఉత్సవం విజయవంతానికి సూచికగా భావిస్తారు. పాలికలు అనే పాత్రలను విత్తనాలను నాటేందుకు వినియోగిస్తారు. బ్రహ్మపీఠాన్ని బియ్యం తదితరాలతో అలంకరించిన తరువాత బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శాంత, ఇంద్ర, ఇసాన మరియు జయ తదితర దేవతలను ఆహ్వానించి అగ్ని ద్వారా పూజలు చేస్తారు. ఆ తరువాత సోమం రాజ మంత్రాన్ని, విష్ణుసూక్తాన్ని పారాయణం చేస్తారు. విత్తనాలు నాటే సమయంలో వరుణ మంత్రాన్ని పఠించి నీళ్లు చల్లుతారు.

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.