బ్రహ్మోత్సవాలు: హంస వాహనం పై శ్రీవారు!

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుకు న్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు […]

బ్రహ్మోత్సవాలు: హంస వాహనం పై శ్రీవారు!
Follow us

| Edited By:

Updated on: Oct 02, 2019 | 5:52 AM

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు. ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుకు న్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగ‌ళ‌వారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందుచేశారు.

తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా రెండో రోజు రాత్రి మలయప్పస్వామి వీణాపాణియై చదువుల తల్లి సరస్వతి రూపంలో హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. నలువైపులా గ్యాలరీల్లోంచి భక్తులు చేతులెత్తి మొక్కుతుండగా.. గోవింద నామ ఘోషల నడుమ శ్రీనివాసుడు చతుర్మాడ వీధుల్లో రంజిల్లుతూ విహరించారు. సకల జనుల అజ్ఞానాన్ని తొలగిస్తూ జ్ఞానకాంతులను ప్రసరింపచేస్తూ జ్ఞానస్వరూపుడై సాక్షాత్కరించారు. గజరాజులు, అశ్వాలు, వృషభాలు ముందు నడుస్తుండగా.. పండితుల వేదమంత్రాలు, కళాబృందాల ప్రదర్శనలు, భక్తుల నీరాజనాల మధ్య వాహన సేవ వైభవంగా సాగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు భారీగా భక్తులు తరలివచ్చారు.