శ్రీశైలం ఘటనకు సిబ్బంది నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలే కారణమా..?

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీఐడీ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

శ్రీశైలం ఘటనకు సిబ్బంది నిర్లక్ష్యం,  నిర్వహణ లోపాలే కారణమా..?
Follow us

|

Updated on: Aug 26, 2020 | 2:47 PM

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్ర ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. సీఐడీ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీశైలం ఎడమ గట్టు అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మరణించిన విసయం విదితమే. అయితే, ఈ కేసుకు సంబంధించి మొదట నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో సీఐడీ పలు మార్పులు చేసింది. ఎఫ్ఐఆర్‌లో పలు సెక్షన్‌లను అదనంగా చేర్చింది. కేసును ప్రభావితం చేసే కీలక అంశాలను సీఐడీ గుర్తించింది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడంపై ప్రమాద తీవ్రతను పెంచిందని సీఐడీ నిర్ధారించింది.

ప్రమాదంపై సిబ్బంది నిర్లక్ష్యం నిర్వహణ లోపాలపై సీఐడీ దృష్టి సారించింది. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో ప్రమాద తీవ్రతను పెంచిందని సీఐడీ గుర్తించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనాన్ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఎందుకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదన్న దానిపై సీఐడీ విచారణ చేపట్టింది. 240 మేగవాట్ల ట్రాన్స్ఫార్మర్స్ బ్లాస్ట్ అయిన నేపథ్యంలో దాన్ని కంట్రోల్ చేయడానికి సరైన పరికరాలను ఏర్పాటు చేయలేదని గుర్తించింది. కాగా, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు స్పెషల్ రెస్క్యూ టీమ్ లేకపోవడంపై ప్రమాద తీవ్రతను పెంచిందని సీఐడీ నిర్ధారించింది. యాజమాన్యం సరి పడినంత రక్షణ చర్యలు తీసుకోకపోవడం వలనే ప్రమాదం తీవ్రత పెరిగిందని భావిస్తోంది. ఈ వారంలో మరోసారి ఘటన స్థలానికి సీఐడీ వెళ్లనుంది. భద్రతలోపాలపై దృష్టి సారించింది. పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చినట్లు సమాచారం.