ప‌ర్యాట‌క కేంద్రాలుగా క‌ర్నూలు జిల్లాలోని పంచ మ‌ఠాలు

కర్నూలు జిల్లాలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవ‌స్థానం త‌రువాత పంచ మ‌ఠాలు బాగా ప్ర‌సిద్ది చెందాయి. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వాటి డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అధికారులు ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో అవి క‌ళ త‌ప్పాయి.

ప‌ర్యాట‌క కేంద్రాలుగా క‌ర్నూలు జిల్లాలోని పంచ మ‌ఠాలు
Follow us

|

Updated on: Sep 04, 2020 | 9:20 AM

కర్నూలు జిల్లాలో శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవ‌స్థానం త‌రువాత పంచ మ‌ఠాలు బాగా ప్ర‌సిద్ది చెందాయి. అయితే గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా వాటి డెవ‌ల‌ప్‌మెంట్ కోసం అధికారులు ఫోక‌స్ పెట్ట‌క‌పోవ‌డంతో అవి క‌ళ త‌ప్పాయి. దీంతో తాజాగా దిద్దుబాటు చ‌ర్య‌లు ప్రారంభించారు ఎండోమెంట్ అధికారులు. పంచ మ‌ఠాలను తిరిగి ప్రాచుర్యంలోకి తీసుకురావాల‌ని నిర్ణ‌యించారు. భ‌క్తుల సంద‌ర్శ‌న కోసం వాటిని నెల‌రోజుల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నట్లు ఈఓ కే.ఎస్. రామారావు తెలి‌పారు.

ఘంటామఠము, రుద్రాక్షమఠము, విభూది మఠము, భీమాశంకర మఠం, సారంగాధర మఠం..మొత్తం ఐదు మ‌ఠాల‌ను సుందరీక‌ర‌ణ చేయ‌నున్నారు. పునరుద్ధరణ పనులు రూ 2.70 కోట్లు కేటాయించారు. అంతేకాదు పంచ మ‌ఠాలు టూరిజం హ‌బ్ మార్చ‌బోతున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Also Read :

ఐటీబీపీకి హోంశాఖ ఆర్డ‌ర్స్ , హైఅలర్ట్​

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఇంట విషాదం

దిగొచ్చిన బంగారం, వెండి ధ‌ర‌లు : తాజా రేట్లు ఇలా !