తెహ్రీక్-ఎ-హురియత్‌ చైర్మన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

జమ్ముకశ్మీర్‌కు చెందిన తెహ్రీక్‌-ఏ-హురియత్ చైర్మన్‌ మహ్మద్‌ అష్రఫ్ సహ్రాయిను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నామని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌లోని..

తెహ్రీక్-ఎ-హురియత్‌ చైర్మన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Jul 12, 2020 | 2:31 PM

జమ్ముకశ్మీర్‌కు చెందిన తెహ్రీక్‌-ఏ-హురియత్ చైర్మన్‌ మహ్మద్‌ అష్రఫ్ సహ్రాయిను జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నామని జమ్ముకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌లోని బాఘట్‌ బార్జుల్లాలోని తన నివాసంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్‌ అష్రఫ్ సహ్రయి.. ఆల్ పార్టీ హురియత్ కాన్షరెన్స్‌ నేత సయ్యద్ అలీ షా గిలానీ నేతృత్వంలోని తెహ్రీక్-ఎ-హురియత్‌కు చైర్మన్‌గా ఉన్నారు. అయితే ఈ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్‌కు గిలానీ గత నెలలోనే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలోనే ఆయన హురియత్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. గతేడాదిలో జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ఆర్టికల్ 370 స్వయం ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. అక్కడి స్థానిక నేతల్ని గృహనిర్భంధం చేసి..ఇప్పుడిప్పుడే వారిని వదులుతోంది.