2021లో భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగకపోతే..

ఐసీసీ మెగా టోర్నమెంట్లు ఏవి జరిగినా.. బ్యాకప్ వేదికలు గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. 2021లో టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగాల్సి ఉంది.

2021లో భారత్‌లో టీ20 ప్రపంచకప్ జరగకపోతే..
Follow us

|

Updated on: Aug 13, 2020 | 6:43 PM

Srilanka And UAE Are The Backup Venues: ఐసీసీ మెగా టోర్నమెంట్లు ఏవి జరిగినా.. బ్యాకప్ వేదికలు గుర్తించడం ఆనవాయితీగా వస్తోంది. 2021లో టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల(ఒకవేళ కరోనా తగ్గకపోతే) భారత్ ప్రపంచకప్‌కు ఆతిధ్యం ఇవ్వకపోతే ప్రత్యామ్నాయ వేదికల్లో ఈ టోర్నీని నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. అందుకోసం శ్రీలంక, యూఏఈలకు బ్యాకప్ వేదికలుగా నిర్ణయించింది. కాగా, ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో.. ఐపీఎల్ 2020 వచ్చే నెల 19 నుంచి యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రణాళికలను బీసీసీఐ రచిస్తోంది.

అటు కరోనా వైరస్ కారణంగా అన్ని ప్రముఖ టోర్నమెంట్లు వాయిదా పడిన సంగతి విదితమే. తాజాగా పరిస్థితులు చక్కబడి ‘బయో సెక్యూర్ బబుల్’ వాతావరణంలో క్రికెట్ సిరీస్ లు మొదలయ్యాయి. మొదటిగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగగా.. ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇక సెప్టెంబర్ 19 నుంచి క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసే ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..