‘బిగ్ బాస్ 3’లో శ్రీరెడ్డి..?

ఉత్తరాదిన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న బిగ్‌బాస్ కార్యక్రమానికి దక్షిణాదిన కూడా క్రేజ్ పెరిగిపోయింది. తెలుగు, తమిళ్‌లో ఈ షో ఇప్పటికే రెండు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక త్వరలో ఈ రెండు భాషల్లో మూడో సీజన్ ప్రారంభం కానుండగా.. అందుకోసం ప్రస్తుతం నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ 3లో శ్రీరెడ్డి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలుగులో కాదు తమిళ బిగ్‌బాస్‌లో ఈ వివాదాస్పద నటి ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సీజన్‌కు కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తుండగా.. ఇటీవల ప్రోమో కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డితో నిర్వాహకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలపై శ్రీరెడ్డి స్పందించింది. ‘‘బిగ్‌బాస్ నిర్వాహకులు నన్ను వచ్చి కలిశారు. కానీ ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించాను’’ అంటూ పేర్కొంది. కాగా ఇటీవల చైన్నెలోనూ ఓ ఇంటిని తీసుకొన్న శ్రీరెడ్డి.. అక్కడి సినిమాల్లో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *