Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 26 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 226770. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 110960. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 109462. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6348. . కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో వెలుగు చూస్తున్న ఆసక్తికర విషయాలు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు పోలీసుల అదుపులో 25 మంది స్ట్రీట్ ఫైటర్లు.. పండుగ్యాంగ్ లొ గుంటూరు, మంగళగిరి చెందిన యువకులు ఉన్నట్టు తేల్చినా పోలీసులు.. పాతనేరస్థుల పైనా అనుమానాలు..
  • అమరావతి లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు తిప్పడానికి రంగం సిద్ధమవుతోంది. బస్సులు తిప్పడానికి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరింది. ఈ విషయంలో తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. ఏపీఎస్‌ ఆర్టీసీ కూడా అంతర్రాష్ట్ర సర్వీసులు తిప్పేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది.
  • ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డిఎంఆర్సి) లోని సిబ్బందికి కరోనా పాజిటివ్. దాదాపు 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. డీఎంఆర్‌సీ అధికారులు.
  • విశాఖ: క్రికెట్ గ్రౌండ్లో కత్తిపోట్లు. మూలపేట మైదానంలో యువకుల మధ్య వివాదం వ్యవహారం. ఆసుపత్రిలో నిలకడగా సాయి ఆరోగ్యం. 3 గంటలపాటు శ్రమించి వైద్యం చేసిన డాక్టర్లు. కత్తిపోటుకు విరిగిన దవడ కిందభాగం.. సాయి ముక్కు, నుదుటిపైనా గాయాలు.. చాతీ, వీపుపైనా కత్తిగాట్లు. దవడలో 6 సెంటీమీటర్ల వెడల్పు.. 3 సెంటీమీటర్ల లోతు గాయం. ఆందోళనలో కుటుంబసభ్యులు. సూర్యపై కఠిన చర్యలు తీసుకోవాలి.. సూర్య నుంచి మాకు ప్రాణ భయముంది.. : సాయి కుటుంబ సభ్యులు. పోలీసుల అదుపులో నిందితుడు సూర్య.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై మరికాసేపట్లో స్పష్టత ఇవ్వనున్న టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. టిటిడి ఉన్నతాధికారులతో సమావేశమైన వైవి సుబ్బారెడ్డి.

శ్రీ పాండురంగస్వామి ఆలయం… పండరీపురం!

Sri Panduranga Swamy Temple History and Travel Guide, శ్రీ పాండురంగస్వామి ఆలయం… పండరీపురం!

భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో దేని విశిష్టత దానిది. వీటిలో కొన్ని శైవక్షేత్రాలు, మరికొన్ని వైష్ణవ క్షేత్రాలు. మన రాష్ట్రంలో ప్రసిద్ది చెందిన తిరుమలగా మహారాష్ట్రలోని పండరిపురం వైష్ణవ క్షేత్రం. భీమా నదీ తీరాన వెలసిన ఈ పుణ్యక్షేత్రం షోలాపూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు ‘విఠోబా’ పేరుతో వెలసియున్నాడు. విఠోబా లేక వితోబా అనే పేరు పురాణాలలో కూడా ఉంది.

మన దేశంలో ఉన్న శ్రీ పాండురంగస్వామి క్షేత్రాల్లో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న దివ్వక్షేత్రం పండరీపురం. విష్ణువు మరో రూపమే మహారాష్ట్రలోని పండరిపురంలో కొలువైన పాండురంగడు. ఓం నమో పాండురంగాయ..ఓం నమో పుండరీక వర్మయా..ఓం నమో నారాయణాయ..ఓం నమో ఆశ్రుత జన రక్షకాయ..అంటూ శ్రీ పాండురంగ స్వామి వారు లీలావిశేషాలతో పునీతమైన పుణ్యక్షేత్రం పండరీపురం.

పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ పాండురంగ స్వామి వారిని విఠలుడు అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు తన భక్తుడైన పుండరీకుడికి మోక్షసిద్దిని ప్రసాధించడానికి గాను ఇక్కడ ఈ పండరీపుర క్షేత్రంలో పాండురంగడుగా అవతరించడాని పురాణాల ద్వారా అవగతం అవుతున్నది.

భీమా నదిలో పవిత్ర స్నానాలు

ఇక్కడ ఈ ప్రాంత ప్రజలచే చంద్రభాగా నదిగా పిలవబడుతున్న భీమా నదిలో పవిత్ర స్నానాలచరించడం ద్వారా సకల పాపాలను పక్షాళింప చేస్తుందని భక్తులు విశ్వసిస్తారు.చంద్రబాగ నదిలో స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు నదికీ సమీపంలో ఉన్న పుండరీకుని మందిరానికి చేరుకుంటారు. శ్రీ పాండురంగ స్వామి వారు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువై ఉండటానికి పుండరీకుడే కారణంగా చెబుతుంటారు.

పుండరీకుడిని దర్శించుకుంటే

పాండురంగడి భక్తుడైన పుండరీకుడిని దర్శించుకుంటే.. స్వామిని స్వయంగా దర్శించుకున్న ఫలితం లభిస్తుందని చెబుతారు. ఆ కారణం చేతన స్నానాధికాలు చేసిన భక్తులు మొదటగా పుండరీకున్ని దర్శించుకుంటారు. పాండుగరండి ఆలయానికి సరిసమానంగా ఉన్న పుండరీకుని మందిరం శోభ మనోహరంగా దర్శనమిస్తుంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు పుండలీకుని భక్తితో ధ్యానించుకుని తరిస్తారు.

శ్రీ పాండురంగనాథ స్వామి ఆలయం 

శ్రీ పాండురంగడు స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దం కాలం నుండే ఈ ఆలయాన్ని అభివ్రుద్ది చేసినట్లు తెలుస్తోంది. పుండలీకుని దర్శించుకున్న తర్వాత పుండలీకుని దర్శించుకున్న తర్వాత భక్తులు ప్రధాన ఆలయం పాండురంగడి దేవాలయానికి చేరుకుంటారు,. ప్రధాన ఆలయానికి వెలుపలి భాగంలో స్వామి వారికి నైవేద్యం సమర్పించడానికి అవసరమైన పూజాద్రవ్వాలన్నింటిని సేకరించుకుని ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. ప్రధాన ఆలయానికి ముందు భాగంలో సంత్ నామ్ దేవ్ మహాద్వారం ముందుగా దర్శనం ఇస్తుంది. ప్రధాన ద్వారానికి ముందు భాగంలో కుడువైపున చౌకమేళ మందిరం దర్శనం ఇస్తుంది. పాండురంగ స్వామి వారి భక్తుడైన చౌకమేళ భక్తుల కోరికలను స్వామి వారికి చేరవేస్తారని చెబుతుంటారు..

గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి

గర్భగుడిలో ఎతైన అరుగు మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చుని వున్న స్వామి వారి అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవు. పాండురంగస్వామివారి పాదాలపై మన శిరస్సు పెట్టి నమస్కరించుకుంటాము..పాండు రంగ స్వామి వారి పాదాలను స్పర్శించి నప్పుడు మనకు ఎంతో ఆనందంగా; ఏదోతెలియని తృప్తి కలుగుతుంది. పుండరీకుడి కోసం వచ్చి ఎండలో నిలబడి , నిలబడి ఎంత నల్లగా అయ్యావు తండ్రీ అని అనిపిస్తుంది.భక్తుల మీద ఆయనకున్న ప్రేమకు ఆనందంతో మన కళ్ళు చెమరిస్తాయి.ఇక్కడ స్వామివారిని తులసీదళాలతో పూజిస్తారు.

ఉపాలయాల్లో రుక్మణి,సత్యభామ

ప్రక్కన వున్న ఉపాలయాల్లో రుక్మణి,సత్యభామ ,రాదధాదేవి ,కాలభైరవుడు,దత్తాత్రేయుడు,సూర్యనారాయణుడు ,మహాలక్ష్మీ,వేంకటేశ్వరస్వామి వున్నారు. ఇక్కడ ఉన్న దేవతామూర్తుల పాదాలు స్పృశించి నమస్కరించు కోవచ్చు. రుక్మిణీదేవి ఆలయంలో వున్న అమ్మవారి పాదాలు స్పృశించవచ్చు.

Related Tags