కోలుకోని శ్రీలంక.. అల్లర్లలో పలువురి అరెస్ట్

ఉగ్రదాడుల నుంచి ఇంకా కోలుకోకమునుపే శ్రీలంకలో హింస చెలరేగింది. ఈస్టర్ దాడులకు నిరసనగా.. ఆ దేశంలోని ముస్లింలపై ప్రతీకారదాడులు కొనసాగుతున్నాయి. హెట్టిపాల ప్రాంతంలో అల్లరిమూకలు విరుచుకుపడ్డాయి. తలకు హెల్మెట్ ధరించిన దుండగులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. ఇళ్లు, మసీదులు లక్ష్యంగా జరుపుతున్న ఈ దాడుల్లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. కొలంబోతో సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రాలేదు..

మరోవైపు శ్రీలంక ప్రభుత్వం వేలాదిమంది ముస్లింలను క్యాంపులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. బౌద్ధులే ఈ దాడులకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఈ దాడులపై స్పందించిన శ్రీలంక ప్రభుత్వం అల్లరి మూకలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ప్రకటించింది. హెట్టిపాల ప్రాంతంలో అల్లరిమూకలపై బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు.. 12మందిని అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *