Breaking News
  • దేశంలో కరోన బాధితుల సంఖ్య 4789కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ. 4312 మందికి కొనసాగుతున్న చికిత్స. కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 352మంది బాధితులు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 124 మంది మృతి. సాయంత్రం 6.00 గంటల వరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ. గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13మంది మృతి.
  • శరవేగంగా రూపుదిద్దుకున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌. అత్యాధునిక ఐసోలేషన్‌ సెంటర్‌గా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ విలేజ్‌. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ను తలపించేలా ఉన్న సదుపాయాలు. మొత్తం 14 అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వెంటిలేటర్‌ సదుపాయం. ఇప్పటికే మూడు అంతస్తుల్లో 1,500 బెడ్స్‌ సిద్ధం. ఒక్కో ఫ్లోర్‌కు 36 గదులు, ప్రతి గదిలో 2 బెడ్స్‌. మరో 11 ఫ్లోర్లు శరవేంగా సిద్ధం చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ. రోజుకు 24 గంటలు 1,200 మంది వైద్య సిబ్బంది విధులు. ఉస్మానియా ఆస్పత్రికి అనుసంధానంగా పని చేయనున్న గచ్చిబౌలి ఐసోలేషన్‌ సెంటర్‌.
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది.. విదేశాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానితులందరినీ ఇప్పటికే క్వారంటైన్, ఐషోలేషన్ కేంద్రాలకు తరలించిన అధికారులు.. ఇంటింటి సర్వేను కూడా మరోసారి వేగవంతం చేశారు.
  • భారత్‌ దగ్గర సరిపడ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఉంది. లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు-లవ్‌ అగర్వాల్‌.
  • లాక్‌డౌన్‌ను పొడిగించే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం. లాక్‌డౌన్‌ పొడిగించాలని కేంద్రంపై వివిధ రాష్ట్రాల ఒత్తిడి. లాక్‌డౌన్‌ పొడిగించాలని ఇప్పటికే ప్రధాని మోదీని కోరిన తెలంగాణ సీఎం కేసీఆర్‌. కేసీఆర్‌ బాటలో మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ఠాక్రే. లాక్‌డౌన్‌ను పొడిగించాలిన కేంద్రాన్ని కోరిన యూపీ సర్కార్‌.

ఐసీసీ ప్రపంచకప్ 2019: ఈసారి వరుణుడి స్థానంలో తేనెటీగలు!

Sri Lanka, ఐసీసీ ప్రపంచకప్ 2019: ఈసారి వరుణుడి స్థానంలో తేనెటీగలు!

ఐసీసీ ప్రపంచకప్ 2019 మ్యాచ్‌లకు ఇన్నాళ్లూ వరుణుడు ఆటంకం కలిగించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని మ్యాచ్‌లు  టాస్‌ పడకుండానే రద్దు కాగా, మరికొన్నింటిని కుదించి కొనసాగించారు. శుక్రవారం దక్షిణాఫ్రికా-శ్రీలంక మ్యాచ్‌కు కూడా కాసేపు ఆటంకం ఎదురైంది. అయితే ఈసారి వరుణుడు కాకుండా… తేనెటీగల వల్ల అంతరాయం కలిగింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ 48 ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా.. ఐదో బంతి వేశాక ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. దీంతో ఆటగాళ్లతో సహా.. అంపైర్లు కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి కింద పడుకున్నారు. కాసేటికి అంతా సర్దుకోవడంతో వెంటనే మ్యాచ్‌ కొనసాగింది.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు మైదానంలో తలపడుతుండగా ఇలా తేనెటీగలు మ్యాచ్‌కు అంతరాయం కలిగిచడం ఇది రెండోసారి. 2017లో ఇరు జట్లు మధ్య వన్డే మ్యాచ్‌ సందర్భంగా తేనెటీగలు మైదానంలో వచ్చి ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించాయి. విచిత్రమేమిటంటే అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఫొటోలను కలిపి క్రికెట్ వరల్డ్‌కప్‌ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

Related Tags