పరువు కోసం సఫారీలు.. సెమీస్ కోసం లంకేయులు

వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఇరు జట్లు తలబడనున్నాయి. ప్రపంచకప్‌లో శ్రీలంక ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. 2 నెగ్గి, మరో 2 ఓడగా… వర్షంతో 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ఈ దశలో లంక సెమీస్‌కు చేరాలంటే చివరి 3 మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దక్షిణాఫ్రికాపై నెగ్గి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తుండగా.. […]

పరువు కోసం సఫారీలు.. సెమీస్ కోసం లంకేయులు
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 28, 2019 | 2:39 PM

వరల్డ్‌కప్‌లో భాగంగా ఇవాళ శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు రంగం సిద్ధమైంది. చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఇరు జట్లు తలబడనున్నాయి. ప్రపంచకప్‌లో శ్రీలంక ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడగా.. 2 నెగ్గి, మరో 2 ఓడగా… వర్షంతో 2 మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఇక ఈ దశలో లంక సెమీస్‌కు చేరాలంటే చివరి 3 మ్యాచ్‌లు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో దక్షిణాఫ్రికాపై నెగ్గి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని లంకేయులు భావిస్తుండగా.. ఇప్పటికే సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించిన సఫారీలు.. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని భావిస్తున్నారు.