చివరి వన్డేలో లంక విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్‌!

Sri Lanka complete clinical series sweep, చివరి వన్డేలో లంక విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్‌!

కొలంబో: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలోనూ లంకేయులు విజయభేరి మోగించారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక.. నిర్ణీత 50 ఓవర్లకు 294 పరుగులు చేసింది. మాధ్యుస్(87), మెండిస్(54), పెరెరా(42), కరుణరత్నే(46) రాణించారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 36 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లంక 122 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో లంక మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. సౌమ్య సర్కార్‌(69), తైజుల్‌ ఇస్లామ్‌(39) మినహా మిగిలిన వారందరూ స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *