మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్ క‌న్నుమూత‌..

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్(70) క‌న్ను మూశారు. వ‌యో సంబంధిత అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఆదివారం సాయంత్రం మృతి చెందార‌ని వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌క‌టించింది. 'ద ఉగాండ‌న్ జేయింట్ లేదా క‌మాలా' పేరుతో..

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 10, 2020 | 2:48 PM

డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ మాజీ రెజ్ల‌ర్ జేమ్స్ హారిస్(70) క‌న్ను మూశారు. వ‌యో సంబంధిత అనారోగ్య‌ స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న ఆదివారం సాయంత్రం మృతి చెందార‌ని వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌క‌టించింది. ‘ద ఉగాండ‌న్ జేయింట్ లేదా క‌మాలా’ పేరుతో సూప‌ర్‌స్టార్‌గా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్రిక‌న్ మాస్క్‌, సింహం బొమ్మ‌లు ఉన్న దుస్తులు ధ‌రించి పోటీల్లో పాల్గొనేవారు జేమ్స్ హారిస్‌. 1980-90 వ‌ర‌కు ఆయ‌న వ‌ర‌ల్బ్ రెజ్లింగ్ ఫెడ‌రేష‌న్ పోటీల్లో పాల్గొన్నారు. కాగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌పంచంలో ఎన్నో చిర‌స్మ‌ర‌ణీయ మ్యాచ్‌ల‌తో క‌మాలా.. అభిమానుల‌ను అల‌రించాడు. ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రెజ్లింగ్‌లో క్లాసిక్ హీరోలైన అండ‌ర్ టేక‌ర్‌, ఆండ్రూ ది జేయింట్, హాల్క్ హోగ‌న్‌ల‌తో క‌మా‌లా భీక‌రంగా పోరాడాడు.

6 అడుగుల 7 ఇంచుల భారీకాయం ముఖానికి పెయింట్‌తో చూడ‌టానికి భ‌యంక‌రంగా ఉండేవాడు. 1993లో డ‌బ్ల్యూడ‌బ్ల్యూ ఈ ప్ర‌పంచంలోకి అడుగుపెట్టిన క‌మాలా.. త‌న ప్రొఫెష‌న‌ల్ కెరీర్‌లో మొత్తం 400 మ్యాచ్‌ల్లో పోటీ ప‌డ్డాడు. ఇక చివ‌రిసారిగా 2006లో క‌నిపించాడు. కానీ 2010 వ‌ర‌కు డ‌బ్ల్యూడ‌బ్ల్యూ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్నాడు. అనంత‌రం తీవ్ర అనారోగ్య స‌మస్య‌ల‌తో డ‌బ్ల్యూడ‌బ్ల్యూకి దూర‌మ‌య్యాడు. డ‌యాబెటీస్‌తో అత‌ని రెండు కాళ్లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి.

Read More: 

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌ధాన‌ అనుచ‌రుడు మృతి

14 ఏళ్ల త‌ర్వాత దొరికిన ప‌ర్సు.. అవాక్క‌యిన వ్య‌క్తి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu