
ఒలింపిక్ బంగారు పతక విజేత భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చాలా పేలవమైన ప్రదర్శనతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ నుంచి నిష్క్రమించాడు. జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఈ పోటీలో నీరజ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. జావెలిన్ త్రో ఫైనల్‌లో అతను 84.03 మీటర్ల దూరాన్ని మాత్రమే అధిగమించగలిగాడు. నీరజ్ తన మొదటి త్రోను 83.65 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత అతని ప్రదర్శన నిరంతరం క్షీణించింది. ఎంతగా అంటే నీరజ్ కనీసం టాప్ 6లోకి కూడా అడుగు పెట్టలేకపోయాడు. తద్వారా అతను ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీ నుంచి నిష్క్రమించాడు. నీరజ్ చోప్రాతో పాటు పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా పేలవమైన ప్రదర్శన చేశాడు. అర్షద్ 82.73 మీటర్ల దూరం మాత్రమే అధిగమించగలిగాడు. దీంతో అతను కూడా టాప్ 6లోకి చేరుకోలేకపోయాడు. అయితే మనదేశానికి చెందిన సచిన్ యాదవ్ పతకంపై ఆశలు కలిగించాడు. కేవలం 40 సెంటీమీటర్ల తేడాతో పతకాన్ని కోల్పోయాడు.
ఆసక్తికరంగా భారతదేశపు రెండవ జావెలిన్ త్రోయర్ సచిన్ యాదవ్ 86.27 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రాను అధిగమించాడు. అతను నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్ వంటి అనుభవజ్ఞులను అధిగమించాడు. యాదవ్ నాల్గవ స్థానంలో నిలిచాడు. సచిన్ తన కెరీర్-బెస్ట్ ప్రదర్శనతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు.
💔 for Neeraj, PB for Sachin!
Neeraj finished on 8th spot while Sachin Yadav launched a personal best 86.27m throw to finish on 4th spot in javelin throw final at the World Athletics Championships in Tokyo. pic.twitter.com/Y0CybF39NL
— Olympic Khel (@OlympicKhel) September 18, 2025
ట్రినిడాడ్, టొబాగోకు చెందిన వాల్కాట్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 88.16 మీటర్లు విసిరి ఈ టైటిల్‌ను సాధించాడు. గ్రెనడాకు చెందిన పీటర్స్ 87.38 మీటర్లు విసిరి రెండవ స్థానంలో నిలిచాడు. అమెరికాకు చెందిన కర్టిస్ థాంప్సన్ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..